క్వీన్ ఎలిజిబెత్ కి కరోనా.. ప్యాలెస్ వదిలేసి..

By telugu news team  |  First Published Mar 23, 2020, 1:06 PM IST

ప్యాలెస్ లోని ఇతర ఉద్యోగులు కూడా కరోనా భయంతో వణికిపోతున్నారు. ఇటీవల రాణి చాలా మందిని కలుసుకున్నారని.. వారి ద్వారానే ఆమెకు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు.


బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2 కి కరోనా వైరస్ సోకింది. దీంతో.. ఆమె తన రాజభవనం బకింగ్ హాం ప్యాలస్ ని వీడారు. 93 ఏళ్ళ ఈమెను ఈ ప్యాలస్ కి దూరంగా ఉన్న విండ్సర్ కేజిల్ కి తీసుకువెళ్లారు. అక్కడ ఆమె దాదాపు ఐసొలేషన్ లో ఉంటారని ఈ ప్యాలస్ వర్గాలు తెలిపాయి. బ్రిటన్ లో కరోనా కారణంగా మరో 10 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 21  కి పెరిగింది.

Also Read భయానకంగా అమెరికాలో పరిస్థితులు.. 24గంటల్లో 100మంది మృతి..

Latest Videos

అయితే.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. కాగా... ప్యాలెస్ లోని ఇతర ఉద్యోగులు కూడా కరోనా భయంతో వణికిపోతున్నారు. ఇటీవల రాణి చాలా మందిని కలుసుకున్నారని.. వారి ద్వారానే ఆమెకు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు.

ఇదిలా ఉండగా... వచ్ఛే నెలలో ఆమె 94 వ బర్త్ డే జరగాల్సి ఉంది. అయితే ఈ వైరస్ కారణంగా ఆ కార్యక్రమాలు రద్దు చేశారు. అంతేకాకుండా త్వరలో ఆమె రెండు దేశాలు పర్యటించాల్సి ఉంది. వాటిని  కూడా రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాణికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు.
 

click me!