మెడికల్ మిరాకిల్: కరోనాను జయించిన 103 ఏండ్ల భామ!

By Sree sFirst Published Mar 21, 2020, 12:38 PM IST
Highlights

కరోనా వైరస్ బారిన అత్యధికంగా చిన్నపిల్లలు, 65 ఇండ్లు పైబడిన ముసలివారు పడే ప్రమాదముందని, వారు కోలుకోవడం కూడా కష్టమని అందరూ భావిస్తూ వస్తున్నారు. దాదాపుగా కరోనా మరణాలు ఇప్పటివరకు చాలా కేసుల్లో ముసలివారిలోనే నమోదవడం ఇందుకు సాక్ష్యంగా చూపెడుతున్నారు కూడా. 

కరోనా కరాళ నృత్యానికి ప్రపంచమంతా విలవిల్లాడిపోతోంది. అన్ని దేశాలు, ప్రజలు కుల మత వర్ణ బేధాలు లేకుండా చివురుటాకుల్లా వణికి[పోతున్నారు. ప్రభుత్వాలన్నీ ఇంకా మందు కూడా లేని ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక ప్రజల కదలికలపై ఆంక్షలువై విధిస్తు తమ పరిధిలోని చర్యలన్నింటిని చేయగలిగినంత మేర చేస్తుంది. 

భారతదేశంపై కూడా కరోనా పంజా బలంగా పడింది. ఇప్పటికే ఒకరకంగా భారతదేశమంతటా షట్ డౌన్ వాతావరణం కనబడుతుంది. కరోనా మహమ్మారి దెబ్బకు కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలెర్ట్ అయ్యాయి. 

కరోనా వైరస్ బారిన అత్యధికంగా చిన్నపిల్లలు, 65 ఇండ్లు పైబడిన ముసలివారు పడే ప్రమాదముందని, వారు కోలుకోవడం కూడా కష్టమని అందరూ భావిస్తూ వస్తున్నారు. దాదాపుగా కరోనా మరణాలు ఇప్పటివరకు చాలా కేసుల్లో ముసలివారిలోనే నమోదవడం ఇందుకు సాక్ష్యంగా చూపెడుతున్నారు కూడా. 

Also read: కరెన్సీ నోట్లతో కరోనా... ఇదో కొత్త రకం టెన్షన్

ఇది ఇలా ఉండగా ఇరాన్ లో 103 సంవత్సరాల బామ్మా కరోనా వైరస్ బారిన పడి పూర్తిగా కోలుకుంది. వారం రోజులకింద సెమనాన్ ప్రావిన్సులో కరోనా వైరస్ బారిన పది అక్కడి ఆసుపత్రిలో చేరింది.

వారం రోజుల చిత్సఅనంతరం ఆమె పూర్తిగా కోలుకుందని. కన్ఫర్మెటరీ టెస్టులు నిర్వహించిన తరువాతే ఆమెకు లేదు అని ధృవీకరించుకొని డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు తెలిపారు. 

ఇరాన్ లో ఇలా ఈపాటికే కరోనా వైరస్ బారిన పడి దాన్ని జయించిన రెండవ సీనియర్ సిటిజెన్ గా రికార్డులకెక్కింది. గతవారం 91ఏండ్ల మరో వృద్ధుడు ఇలానే ఈ కరోనా బారిన పది కోలుకున్నాడు. 

Also read; లండన్ నుంచి యువతికి కరోనా పాజిటివ్: తెలంగాణలో 19 కేసులు

కరోనా ధాటికి ఇరాన్ కకావికలమైంది. ఫిబ్రవరి 19న ఇరాన్ లో తొలి కేసు నమోదయింది. అప్పటి నుండి మొదలు నిన్నటి వరకు నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 100 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. 

ఇక భారతదేశంలో కూడా కరోనా విజృంభిస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్యా రోజు రోజుకి పెరిగిపోతుంది. దేశంలో 258 కేసులు రికార్డయ్యాయి. మహారాష్ట్ర ఎక్కువగా కరోనావైరస్ వ్యాప్తికి గురైనట్లుకనిపిస్తోంది. ఆ తర్వాత స్థానం కేరళ ఆక్రమిస్తోంది. విదేశాల నుంచి ముంబైకి ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చే అవకాశం ఉండడం వల్ల కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు భావించవచ్చు. 

గల్ఫ్ నుంచి కేరళకు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. దీంతో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు భావించవచ్చు.

మహారాష్ట్రలో 52 కేసులు నమోదు కాగా, కేరళలో 40 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యఅంతకంతకూ పెరుగుతున్నాయి. హిమాచల్ లో మొదటి కరోనా కేసు నమోదైంది. మధ్యప్రదేశ్, గుజరాత్ ల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

click me!