ఉక్రెయిన్ యుద్ధానికి ముందే బ్రిటన్ పై క్షిపణి దాడి చేస్తానని పుతిన్ బెదిరించాడు - బోరిస్ జాన్సన్

By team teluguFirst Published Jan 30, 2023, 11:22 AM IST
Highlights

ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసేందుకు ముందే ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తమ దేశంపై దాడి చేస్తానని హెచ్చరించాడని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోపించారు. బీబీసీ తాజాగా రూపొందించిన ఓ డాక్యుమెంటరీలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన బలగాలను ఉక్రెయిన్‌పై దాడి చేయాలని ఆదేశించే ముందు బ్రిటన్‌ను క్షిపణితో దెబ్బతీస్తానని బెదిరించారని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోపించారు. బీబీసీ తాజా డాక్యుమెంటరీ ప్రకారం.. ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించేందుకు కొద్దిసేపటి ముందు జాన్సన్‌కు పుతిన్ బెదిరింపు ఫోన్ కాల్ ద్వారా వచ్చింది.

త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌లు: అభ్యర్థుల తొలి జాబితా ప్ర‌క‌టించిన టీఎంసీ

ఒక నిమిషంలోనే బ్రిటన్‌ను ఢీకొట్టేందుకు క్షిపణిని పంపగలనని పుతిన్ తనను హెచ్చరించాడని ఈ బీబీసీ డాక్యుమెంటరీలో బోరిస్ జాన్సన్ వెల్లడించారు. 2022 ఫిబ్రవరిలో సుధీర్ఘమైన కాల్ లో యుద్ధం వల్ల విపత్తు వస్తుందని హెచ్చరించిన తరువాత పుతిన్ నుంచి ఈ బెదిరింపు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 

ఈ డాక్యుమెంటరీ సోమవారం ప్రసారం కానుంది. ఇందులో ఇద్దరు నేతల మధ్య జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ వివరాలు వెల్లడికానున్నాయి. దీంతో పాటు ప్రపంచ నేతలతో పుతిన్‌ల పరస్పర చర్యలు కూడా అందులో ఉండే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై దాడికి వ్యతిరేకంగా యూకే పీఎం పుతిన్‌ను హెచ్చరించినట్లు డాక్యుమెంటరీ వెల్లడించింది. ఇది పాశ్చాత్య ఆంక్షలకు దారితీస్తుందని, రష్యా సరిహద్దుల్లో మరిన్ని నాటో దళాలను మోహరిస్తుందని ఆయన చెప్పారు. జాన్సన్ రష్యా సైనిక చర్యను అరికట్టడానికి ప్రయత్నించాడు. భవిష్యత్తులో ఉక్రెయిన్ నాటోలో చేరదని పుతిన్‌కు తెలిపారు.

మానసిక వ్యాధితో బాధపడుతున్న ఏఎస్ఐ గోపాల్‌క్రుష్ణ దాస్.. అయినా సర్వీస్ రివాల్వర్ జారీ

బోరిస్ జాన్సన్ చెప్పిన మాటలపై పుతిన్‌కు నమ్మకం కలగలేదు. ఒకానొక దశలో రష్యా నాయకుడు తనను బెదిరించాడని జాన్సన్ అన్నారు. ‘‘బోరిస్, నేను మిమ్మల్ని బాధపెట్టాలనుకోవడం లేదు. కానీ క్షిపణితో అది ఒక నిమిషం మాత్రమే పడుతుంది’’అని అన్నారని చెప్పారు. ఉక్రెయిన్ కు మద్దతు తెలిపేందుకు, రష్యా దాడిని నిరోధించడానికి తాను, ఇతర పాశ్చాత్య నేతలు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.

బుల్లెట్ గాయాలతో ఒడిశా ఆరోగ్య మంత్రి మరణం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కాగా... ఆ రోజుల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీకి అత్యంత ఉద్వేగభరితమైన పాశ్చాత్య మద్దతుదారుల్లో జాన్సన్ ఒకరుగా ఉన్నారు. తొమ్మిది రోజుల తరువాత ఫిబ్రవరి 11న రక్షణ మంత్రి బెన్ వాలెస్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ షోయిగును కలవడానికి మాస్కోకు వెళ్లారు. బీబీసీ రూపొందించిన ‘‘పుతిన్ వర్సెస్ ది వెస్ట్’’ అనే డాక్యుమెంటరీ రష్యా ఉక్రెయిన్ ను ఆక్రమించదని వాలెస్ హామీలు ఇచ్చినట్లు వెల్లడిస్తుంది. కానీ ఇది అబద్ధం అని రెండు పక్షాలకు తెలుసునని ఆయన అన్నారు.

click me!