లంచ్ దొంగతనం చేసిందని కుక్కపై విచారణ..!

By telugu news teamFirst Published Jan 30, 2023, 9:46 AM IST
Highlights

అది ఓ పోలీసు అధికారి లంచ్ దొంగతనం చేసిందట. అందుకని దానిపై కేసు పెట్టి... విచారణ మొదలుపెట్టారు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసు కుక్కలను మీరు చాలా సార్లు చూసే ఉంటారు. అవి కూడా చాలా సార్లు... క్రిమినల్స్ ని పట్టుకోవడానికి కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. వాసనతో నేరస్తులు ఎవరు, ఎటు వెళ్లారు అలాంటి వాటిని అవి గుర్తించగలవు. అందుకే... పోలీసులు చాలా కేసుల్లో ఈ పోలీసు కుక్కల సహాయం తీసుకుంటాయి. కాగా.... అలా పోలీసుల దగ్గర పనిచేసే ఓ కుక్కపై తాజాగా విచారణ చేపట్టారు. ఎందుకో తెలుసా..? అది ఓ పోలీసు అధికారి లంచ్ దొంగతనం చేసిందట. అందుకని దానిపై కేసు పెట్టి... విచారణ మొదలుపెట్టారు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 

యూఎస్ పోలీస్ విభాగానికి చెందిన కుక్క పేరు ఐస్. ఈ కుక్క జనవరి 12వ తేదీన  తన సహోద్యోగి లంచ్ దొంగతనం చేసింది. దీంతో... కుక్కపై క్రిమినల్ కేసు పెట్టి... దాని ఫోటోని సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడం గమనార్హం. అక్కడ పనిచేసే పోలీసు అధికారి  బార్విగ్... తన లంచ్ చేస్తుండగా... మధ్యలో ఏదో పనిమీద అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది. తిరిగి వచ్చి చూసే సరికి అతని లంచ్ కనిపించకుండా పోయిందట. దీంతో.. వెంటనే అతను పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో.. ఐస్ అనే పోలీసు కుక్క దాని లంచ్ తో పాటు... అతని లంచ్ కూడా తినేసిందని తేలిందట. అంతే.. ఆ కుక్కపై కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. అయితే... కుక్కపై విచారణ జరపడాన్ని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకిస్తున్నారు. దానిపై కేసు పెట్టడానికి వీలు లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఐస్ కోసం తాము దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కొందరు కామెంట్స్ చేయడం గమనార్హం.
 

click me!