అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ లూనార్ ల్యాండర్ చంద్రుని మీద కక్ష్యలోకి చేరుకుంది. ఆ తరువాతి రోజు చంద్రుని మీద ల్యాండింగ్ అయ్యింది.
అమెరికా : బుధవారం అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ లూనార్ ల్యాండర్ చంద్రుని వద్దకు చేరుకుంది. బుధవారంనాడు ఈ ల్యాండర్ తక్కువ కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ తరువాత చంద్రుడి మీద బూడిద, మురికి ఉపరితలంపై ల్యాండింగ్ అయ్యింది. హూస్టన్ కు చెందిన ఇంటూటివ్ మెషీన్స్ ఈ రోబోటిక్ లూనార్ ల్యాండర్ ఒడిస్సియన్ ను నిర్మించింది. ఇది బుధవారం విజయవంతంగా చంద్రుడిపై దిగింది.
1972లో NASA వ్యోమగాముల అపోలో ప్రోగ్రామ్ తరువాత, దాదాపు 50 సంవత్సరాలకు మొదటిసారిగా అమెరికా చంద్రునిపై ప్రైవేట్ లూనార్ ను విజయవంతంగా ప్రవేశపెట్టగలిగింది. అంతకు ముందు అమెరికా చేసిన ఏ ప్రయత్నాలూ ఫలించలేదు. ఫిబ్రవరి 15న స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ -9 రాకెట్ తో ఆరు కాళ్లున్న లూనార్ ల్యాడర్ ఒడిస్సియస్ ను ప్రయోగించారు. దీనిని ఐఎమ్-1 ల్యాండర్ అని కూడా పిలుస్తారు.
undefined
ఈ ప్రయోగం విజయవంతం అయితే, చంద్రునిపై కాలుమోపిన మొదటి ప్రైవేట్ కంపెనీగా స్పేస్ ఎక్స్ అవతరిస్తుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వాణిజ్య కార్యక్రమం లూనార్ పేలోడ్ సర్వీస్ కింద ఈ ప్రయోగం చేపట్టారు. దీనికోసం ఇంట్యూటివ్ మెషీన్స్ తో మొత్తం 18 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీన్ని మొదట ఫిబ్రవరి 14న ప్రయోగించాలనుకున్నారు. కానీ, మిథేన్ ఉష్ణోగ్రతలో మార్పు కారణంగా సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫిబ్రవరి 15న మిషన్ ప్రారంభించారు.
వారంరోజుల ప్రయాణం తరువాత ఈ ల్యాండర్ బుధవారం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఇంటూటివ్ మెషీన్స్ ల్యాండర్ భూమితో సంబంధాలు తెగిపోయి.. కక్ష్యలోకి చేరే క్రమంలో రాకెట్ థ్రస్టర్ ను ఏడు నిమిషాల పాటు మండించారు. ల్యాండర్ కక్ష్యలో ఉందో లేక లక్ష్యం లేకుండా దూసుకుపోతుందో తెలుసుకోవడానికి కంపెనీ హ్యూస్టన్ ప్రధాన కార్యాలయంలోని ఫ్లైట్ కంట్రోలర్‌లు కొంత సమయం వరకు వేచి ఉండాల్సి వచ్చింది.
రాబోయే 24 గంటల్లో రోబోట్ స్పేస్ క్రాఫ్ట్ కక్ష్యలో నుంచి చంద్రుని దక్షిణ దృవం ఉపరితలంపై ల్యాండింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఐఎమ్-1 ల్యాండర్ మిషన్ 16 రోజుల మిషన్. చంద్రుడి మీద దిగిన తరువాత 7 రోజులు పనిచేస్తుంది.