ఫిలిప్పీన్స్ లో ట్రక్కు లోయలో పడిపోవడంతో 15 మంది మృతి..

By SumaBala BukkaFirst Published Feb 22, 2024, 8:34 AM IST
Highlights

ఫిలిప్పీన్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం 15మందిని బలి తీసుకుంది. నిబంధనలు సరిగా పాటించకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. 

ఫిలిప్పీన్స్ : ఫిబ్రవరి 21, బుధవారంనాడు సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని ఓ లోయలో ట్రక్కు పడిపోయింది. దీంతో అందులోని 15 మంది మరణించారు. ఈ మేరకు రెస్క్యూ అధికారి తెలిపారు. ఈ ట్రక్కు నీగ్రోస్ ద్వీపంలోని పశువుల మార్కెట్‌కు వారిని తీసుకువెడుతోందని మాబినే మునిసిపాలిటీకి చెందిన రెస్క్యూ అధికారి మిస్టర్ మైఖేల్ కాబుగ్నాసన్ తెలిపారు.

"రోడ్డు మలుపు తిరిగే దగ్గర ట్రక్కు అదుపు తప్పి లోయలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు" అని ఆయన అన్నారు. మాబినే సమీపంలోని పర్వత ప్రాంతం తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాద సమయంలో ట్రక్కులో ఉన్న 17 మందిలో ఒక ప్రయాణికుడు, డ్రైవర్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

రోడ్డుకు కనీసం 50 మీటర్ల కింద ఉన్న లోయ అడుగున శిధిలాలలో ట్రక్కు డ్రైవర్ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అతడిని రక్షించినట్లు కాబుగ్నాసన్ చెప్పారు. ఫిలిప్పీన్స్‌లో ఇలాంటి ఘోరమైన రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం, ఇక్కడ డ్రైవర్లు తరచుగా నిబంధనలను ఉల్లంఘిస్తారు. వాహనాలు కూడా సేఫ్టీ మెజర్ మెంట్స్ సరిగా ఉండవు. ఓవర్‌లోడ్ చేసి, నడుపుతుంటారు. 

click me!