ప్రాణం తీసిన ప్లాస్టిక్ ఫోర్క్.. మారణాయుధం అనుకుని కాల్పులు...

By SumaBala BukkaFirst Published Feb 22, 2024, 11:54 AM IST
Highlights

ప్లాస్టిక్ ఫోర్క్ చూసి మారణాయుధం అనుకుని ఓ వ్యక్తిని కాల్చి చంపిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. 

లాస్ ఏంజిల్స్ : ప్లాస్టిక్ ఫోర్క్ పట్టుకోవడం ఓ మనిషి ప్రాణాలమీదికి వచ్చిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. ఫోర్క్ పట్టుకున్న వ్యక్తిని అధికారులు కాల్చి చంపిన ఘటనకు సంబంధించిన బాడీ-క్యామ్ ఫుటేజీని లాస్ ఏంజెల్స్ పోలీసులు విడుదల చేశారు. లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌లోని ఒక గోడౌన్ లో ఫిబ్రవరి 3న జరిగిన కాల్పుల్లో ఈ ఘటన వెలుగుచూసింది. అయితే, ఆ అధికారి అంతగా రియాక్ట్ అయ్యేంత ప్రాణాంతక చర్య ఏమిటో, ఏ నిబంధనలను పాటించారో, లేదో తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నామని.. అధికారులు మంగళవారం తెలిపారు.

కాల్పులు జరిపిన వ్యక్తిని జాసన్ లీ మకానీ (36)గా గుర్తించారు. మంగళవారం విడుదలైన ఫుటేజీలో ఒక భవనం కారిడార్‌లో అర డజను మంది పోలీసు అధికారులు ఒక వ్యక్తిని చుట్టుముట్టడం కనిపిస్తుంది. చేతులు పైకెత్తి, కదలకుండా నిలుచోవాలని ఆ వ్యక్తికి చెబుతున్నారు. కాసేపు అతను విన్నాడు. కానీ ఆ తరువాతే కదలడం మొదలుపెట్టాడు. చేతులు పిడికిలి బిగించి, స్క్రూడ్రైవర్ లా కనిపిస్తున్న వస్తువును పట్టుకుని నడుస్తుండడం గమనించారు. 

ఫిలిప్పీన్స్ లో ట్రక్కు లోయలో పడిపోవడంతో 15 మంది మృతి..

వెంటనే అతడిని లొంగిపొమ్మని హెచ్చరించారు. కానీ అతను వినకపోవడంతో కాల్పులు జరిపారు. అని ఒక ప్రకటనలో తెలిపారు. వీడియోలో, కాల్పులు మొదలుపెట్టగాను ఆ వ్యక్తి పోలీసు దగ్గరికి వస్తుండడం కనిపిస్తుంది.  ఒక మహిళా అధికారి దగ్గరున్న బీన్‌బ్యాగ్ షాట్‌గన్‌ను లాక్కున్నాడు. దీంతో అతని మీద కాల్పులు జరిగాయి" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఒక గోడౌన్ లో "ఆయుధాలతో దాడి" కి సంబంధించి ఎవరో ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేయడంతో పోలీసులు భవనం వద్దకు చేరుకున్నారు. ఆ వ్యక్తి డ్రగ్స్ లేదా మద్యం మత్తులో ఉన్నాడని, యజమానిని కర్రతో బెదిరిస్తున్నాడని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు. మక్కనీ సమీపంలోని ఆసుపత్రిలో మరణించాడు. కాల్పుల్లో గోదాం ఉద్యోగులు, పోలీసులు ఎవరూ గాయపడలేదు.
 

click me!