పిజ్జా, చికెన్ ల కోసం ఖైదీల డిమాండ్, 70 ఏళ్ల గార్డును బందించి ఆందోళన.. ఎక్కడంటే...

Published : Aug 23, 2023, 02:23 PM IST
పిజ్జా, చికెన్ ల కోసం ఖైదీల డిమాండ్, 70 ఏళ్ల గార్డును బందించి ఆందోళన.. ఎక్కడంటే...

సారాంశం

మిస్సౌరీలోని సెయింట్ లూయిస్ జైలులో ఉన్న ఖైదీలు 70 ఏళ్ల గార్డును బందించారు. తమకు 'పిజ్జా, చికెన్ ప్యాటీలు' కావాలంటూ డిమాండ్ చేశారు. ప్రతిరోజూ వేడి ఆహారం ఇవ్వాలని పట్టుబట్టారు. 

మిస్సోరీ : మంగళవారం ఉదయం, సెయింట్ లూయిస్ డౌన్‌టౌన్‌లోని జస్టిస్ సెంటర్‌లోని ఖైదీలు 70 ఏళ్ల గార్డును బందించారు. దీంతో గందరగోళం నెలకొంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు నాల్గవ అంతస్తులో ఈ సంఘటన చోటు చేసుకుంది, పరిస్థితిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ జైలులో మొత్తం 700మంది ఖైదీలుంటారు. ఫాక్స్ 2 నౌ నివేదించినట్లుగా, ఉదయం దాదాపు 8:30 గంటలకు గార్డును విడుదల చేశారు. తమకు ఆహారంలో చికెన్, పిజ్జాలు కావాలని.. వేడి ఆహారం కావాలని వారు డిమాండ్ చేశారు. గార్డుకు ఎలాంటి హానీ కలిగించలేదు. 

ఈ ఘటన జైలులోని పరిస్థితులను ఖైదీలకు అందించే సదుపాయాల లేమిని వాటిమీద ఖైదీల అసంతృప్తిని నొక్కి చెబుతుంది. విడుదలైన తర్వాత, 70 ఏళ్ల గార్డును వైద్య సహాయం కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతనికి గాయాలు ఎలా ఉన్నాయనేది ఇంకా స్పష్టత లేదు. 

కాగా ఈ జైలులో గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సందర్బాలు ఉన్నాయి. 2021లో ఈ జైలులోని ఖైదీలు అల్లర్లకు పాల్పడ్డారు. జైలు కిటికీలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో జైలు ఉన్నతాధికారులు రాజీనామాలు చేశారు. 

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..