ప్రముఖ ఇండో - అమెరికన్ గణిత శాస్త్రవేత్త సీఆర్ రావు ఇక లేరు..

Published : Aug 23, 2023, 01:38 PM IST
ప్రముఖ ఇండో - అమెరికన్ గణిత శాస్త్రవేత్త సీఆర్ రావు ఇక లేరు..

సారాంశం

ప్రముఖ గణిత శాస్త్రవేత్త సీఆర్ రావు బుధవారం చనిపోయారు. ప్రస్తుతం ఆయనకు 102. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యం వల్ల కన్నుమూశారు. ఆయన కర్ణాటకలోని ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు.

ప్రముఖ భారతీయ అమెరికన్ గణిత శాస్త్రవేత్త కల్లంపూడి రాధాకృష్ణారావు బుధవారం కన్నుమూశారు. ఆయన ప్రస్తుత వయసు 102 ఏళ్లు. సి.ఆర్.రావుగా పిలిచే ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ (ప్రస్తుతం కర్ణాటకలో ఉంది) లోని బళ్లారిలోని హడగలిలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు.

ఆయన విద్యాభ్యాసం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలలో పూర్తయింది. 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గణితంలో ఎమ్మెస్సీ, కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి స్టాటిస్టిక్స్ లో ఎంఏ పట్టా పొందారు. 1948లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కళాశాలలో ఆర్.ఎ.ఫిషర్ ఆధ్వర్యంలో పీహెచ్ డీ పట్టా పొందారు. 1965 లో కేంబ్రిడ్జ్ నుండి కూడా డీఎస్ సీ పట్టా పొందాడు.

ఈ ఇండో-అమెరికన్ గణిత శాస్త్రవేత్తకు ఇటీవల అంతర్జాతీయ గణాంక పురస్కారం లభించింది, ఇది గణాంక శాస్త్రంలో నోబెల్ బహుమతితో సమానం. ఈ అంశంలో అత్యంత విశిష్టమైన వ్యాఖ్యాత అయిన కల్లంపూడి రాధాకృష్ణారావు గణాంక శాస్త్రానికి సంబంధించిన అనేక శాఖలలో చేసిన మహత్తర కృషి చేశారు. 

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..