జెలెన్స్కీతో ఫోన్ లో మాట్లాడిన ప్ర‌ధాని మోడీ.. ఉక్రెయిన్ వివాదానికి సైనిక చ‌ర్యే ప‌రిష్కారం కాద‌ని సూచ‌న‌

By team teluguFirst Published Oct 5, 2022, 6:51 AM IST
Highlights

ఉక్రెయిన్ వివాదాన్ని దౌత్య మార్గంలో పరిష్కరించుకోవాలని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించేందుకు భారత్ పూర్తిగా సహకరిస్తుందని అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ మంగళవారం ఫోన్ లో మాట్లాడారు. 

ఉక్రెయిన్ వివాదానికి సైనిక చ‌ర్యే ప‌రిష్కారం కాద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. శత్రుత్వాన్ని వ‌దిలి దౌత్య మార్గాన్ని అనుస‌రించాల‌ని సూచించారు. మంగ‌ళ‌వారం భార‌త ప్రధాని నరేంద్ర మోడీ  ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ఫోన్ లో మాట్లాడారు. అణు కేంద్రాల వ‌ల్ల ప్రజారోగ్యానికి, పర్యావరణానికి చాలా ప్ర‌మాదం అని అన్నారు. వీటి వ‌ల్ల ధీర్ఘ‌కాలంలో చాలా వినాశకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

దుబాయ్ లో హిందూ దేవాలయం ప్రారంభం.. ఆ ఆల‌యం చాలా ప్ర‌త్యేకం..

ఇరు దేశాల నాయ‌కుల సంభాష‌ణ‌లో ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణపై చర్చించారు. వీరి సంభాష‌ణ‌కు సంబంధించి భార‌త ప్ర‌ధాని కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం శత్రుత్వాలను త్వరగా ముగించాలని,  ఇరు దేశాల నాయ‌కులు సంభాష‌ణ‌ల ద్వారా, దౌత్య మార్గం ద్వారా వివాదాన్ని ప‌రిష్క‌రించుకోవాల‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు. 

PM Modi held a telephonic conversation today with Ukrainian President Volodymyr Zelenskyy, discussed the ongoing conflict in Ukraine.

PM Modi reiterated his call for early cessation of hostilities and the need to pursue the path of dialogue and diplomacy: PMO

(file pics) pic.twitter.com/VZY4hfJ3SU

— ANI (@ANI)

సైనిక చ‌ర్య ఈ వివాదానికి ప‌రిష్కారం కాద‌ని ప్ర‌ధాని మోడీ నొక్కి చెప్పారు. ఈ వివాదం విష‌యంలో ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా సహకరించేందుకు భారత్ సంసిద్ధంగా ఉంద‌ని అన్నారు. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టం, అన్ని రాష్ట్రాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించం వంటి వాటి ప్రాముఖ్యతను కూడా మోడీ పునరుద్ఘాటించారు.

అలా చేస్తే.. నిత్యం మ‌ర‌ణ‌హోం జ‌రుగుతుంద‌న్నారు.. కానీ ఇప్పుడు ఎలా ఉందో చూడండి

ఈ సంద‌ర్భంగా ఉక్రెయిన్‌తో పాటు అణు వ్యవస్థాపనల భద్రతకు భారతదేశం ప్రాముఖ్యతనిస్తుందని ప్ర‌ధాని మోడీ నొక్కిచెప్పారు. అణు కేంద్రాల ప్రమాదాలు ప్రజారోగ్యం, పర్యావరణానికి సుదూర కాలం వినాశకరమైన పరిణామాలను కలిగిస్తాయని తెలిపారు. 

Breaking: Indian PM, Ukraine Prez hold telephonic talks. PM Modi tells Zelenskyy that, "India attaches importance to the safety and security of nuclear installations, including in Ukraine". pic.twitter.com/wFkThLX7qk

— Sidhant Sibal (@sidhant)

నవంబర్ 2021లో గ్లాస్గోలో జరిగిన చివరి సమావేశంలోని ముఖ్య‌మైన అంశాలను ఇద్ద‌రు నాయ‌కులు మళ్లీ గుర్తుచేసుకున్నారు. ఇందులో ప‌లు ముఖ్య‌మైన రంగాల‌పై చ‌ర్చ జ‌రిగింది.  ఇదిలా ఉండ‌గా.. యూరోప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ కాంప్లెక్స్ అయిన జపోరిజ్జియా ప్లాంట్‌పై దాడులకు ఉక్రెయిన్, రష్యా పరస్పరం ఆరోప‌ణ‌లు చేసుకున్నాయి.

click me!