పవర్ గ్రిడ్ ఫెయిల్.. అంధకారంలో బంగ్లాదేశ్.. కారణం తెలియక సతమతం

Published : Oct 04, 2022, 06:57 PM ISTUpdated : Oct 04, 2022, 07:12 PM IST
పవర్ గ్రిడ్ ఫెయిల్.. అంధకారంలో బంగ్లాదేశ్.. కారణం తెలియక సతమతం

సారాంశం

బంగ్లాదేశ్‌లో ఈ రోజు మధ్యాహ్నం నుంచి కరెంట్ సేవలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత గ్రిడ్ ఫెయిల్ కారణంగా పవర్ పోయిందని తెలుస్తున్నది. ఈ రోజు రాత్రి 8 గంటలకల్లా రాజధాని ఢాకాలో విద్యుత్ పునరుద్ధరిస్తామని మంత్రి చెప్పారు.

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో దాదాపు 13 కోట్ల మంది పౌరులు చీకటిలోనే మగ్గుతున్నారు. పవర్ గ్రిడ్ ఫెయిల్ కావడంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి బంగ్లాదేశ్‌లో కరెంట్ లేకుండా పోయిందని ప్రభుత్వ పవర్ యుటిలిటీ కంపెనీ వెల్లడించింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఆకస్మికంగా ఈ ఔటేజ్ కలిగిందని బంగ్లాదేశ్‌కు చెందిన పవర్ డెవలప్‌మెంట్ బోర్డు తెలిపింది.

బంగ్లాదేశ్‌లోని కొన్ని ఆగ్నేయ ప్రాంతాలు మినహాయిస్తే.. దేశం మొత్తం కరెంట్ లేక అంధకారంలోకి వెళ్లిపోయింది. మిగతా దేశం మొత్తం కరెంట్ లేకుండానే ఉన్నదని ఏజెన్సీ ప్రతినిధి షమిమ్ ఎహెసాన్ తెలిపారు.

దేశంలో 130 మిలియన్ల పౌరులు కరెంట్ లేకుండానే ఉన్నారని, పవర్ పోవడానికి గల కారణాలు ఏమిటో కూడా తెలియరాలేదని ఆయన వివరించారు. పవర్ పోవడానికి గల కారణాలను ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నారని తెలిపారు. సాంకేతిక లోపం అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. 

రాజధాని ఢాకాలో కరెంట్ మళ్లీ ఈ రోజు రాత్రి 8 గంటల కల్లా పునరుద్ధరిస్తామని టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జునైద్ పాలక్ ఓ ఫేస్‌బుక్ పోస్టులో తెలిపారు. ఢాకాలోనే సుమారు 22 మిలియన్ల ప్రజలు జీవిస్తుంటారు.

ఇటీవలి నెలల్లో బంగ్లాదేశంలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఉక్రెయిన్ పై రష్యా దాడుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఎనర్జీ ప్రైసెస్‌తో బంగ్లాదేశ్ ఈ తీవ్ర సమస్యను చవిచూడాల్సి వస్తున్నది.

Also Read: ఇంకా చీక‌ట్లోనే పుదుచ్చేరి.. లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం నివాసాలకూ ప‌వ‌ర్ నిలిపివేత‌..

కానీ, దీర్ఘకాలం పవర్ లేకుండా పోవడంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. డిమాండ్ సరిపడా కరెంట్ అందించడానికి దిగుమతి చేసుకునే డీజిల్, గ్యాస్ కోసం డబ్బులు చెల్లించడానికే సతమతం అవుతున్నది.

2014 నవంబర్‌లో బంగ్లాదేశ్‌లో తీవ్రమైన బ్లాకౌట్ వచ్చింది. దాదాపు దేశంలోని 70 శాతం ప్రజలు సుమారు పది గంటల పాటు కరెంట్ లేకుండానే గడపాల్సి వచ్చింది.

PREV
click me!

Recommended Stories

Law: పెళ్లికి ముందు శారీర‌కంగా కలిస్తే జైలు శిక్ష‌.. చ‌ట్టాన్ని తీసుకొచ్చిన ప్ర‌భుత్వం
Longest Expressway Tunnel : ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్ ఎక్కడో తెలుసా?