భారీ భూకంపం : టర్కీ, సిరియాల్లో 300మందికి చేరిన మృతుల సంఖ్య.. నిద్రలోనే మృత్యుఒడికి...

By SumaBala BukkaFirst Published Feb 6, 2023, 12:49 PM IST
Highlights

ఒకటి వెంట ఒకటి 15 ని.ల వ్యవధిలో రెండు భూకంపాలు టర్కీని కుదిపేశాయి. ఈ ప్రమాదంలో సిరియా, టర్కీలలో ఇప్పటివరకు 300మంది మృతి చెందినట్లు సమాచారం. అనేక మంది క్షతగాత్రులయ్యారు.

ఇస్తాంబుల్: ఆగ్నేయ టర్కీలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా సిరియాలోని ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతాల్లో సోమవారం కనీసం 237 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. "అలెప్పో, లటాకియా, హమా, టార్టస్ ప్రావిన్స్‌లలో ఆరు వందల ముప్పై తొమ్మిది మంది గాయపడ్డారు. 237 మంది మరణించారు" అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

అంతకుముందు, టర్కిష్ అనుకూల వర్గాల నియంత్రణలో ఉన్న ఉత్తర ప్రాంతాలలో భూకంపం వల్ల కనీసం ఎనిమిది మంది చనిపోయారని ఒక ఆసుపత్రి వర్గాలు తెలిపింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 245కు చేరుకుంది. ఈ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

టర్కీలోని ఎమర్జెన్సీ సర్వీస్ అధికారులు మొదట 76మంది మరణించినట్లుగా గుర్తించారు. అయితే ఇది గణనీయంగా ఎక్కువ పెరుగుతుందని బెదిరించింది. ఎందుకంటే రాత్రి సమయంలో సంభవించిన ఈ భూకంపం వల్ల ప్రధాన నగరాల్లో డజన్ల కొద్దీ అపార్ట్మెంట్లు నేలకూలాయి. టీవీల్లో కనిపిస్తున్న దృశ్యాల్లో టర్కీలో ప్రజలు తమ నైట్ డ్రెస్సులతోనే మంచులో నిలబడి, శిధిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షిస్తున్న వారిని గమనించడం కనిపిస్తుంది. 

టర్కీ భూకంపంలో 53మంది మృతి... సిరియాలోనూ తీవ్రత..

స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 04:17 గంటలకు17.9 కిలోమీటర్ల (11 మైళ్లు) లోతులో భూకంపం సంభవించిందని, 15 నిమిషాల తర్వాత 6.7 తీవ్రతతో మరో భూకంపం సంభవించిందని యుఎస్ ఏజెన్సీ తెలిపింది. భూకంపం కనీసం ఒక శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని తాకిన అత్యంత శక్తివంతమైనది.

"మేము వీలైనంత త్వరగా, అతి తక్కువ నష్టంతో ఈ విపత్తును అధిగమించగలమని మేము ఆశిస్తున్నాంజ భూకంపం దక్షిణ టర్కీ పొరుగున ఉన్న సిరియాలోని ప్రధాన నగరాల్లో డజన్ల కొద్దీ భవనాలు నేలమట్టం అయ్యాయి. టర్కిష్ టెలివిజన్, సోషల్ మీడియాలోని చిత్రాలు కహ్రామన్‌మరాస్, పొరుగున ఉన్న గజియాంటెప్‌లోని భవనాల శిథిలాలను రెస్క్యూ టీం పనిచేస్తున్నాయి. 

సిరియాలోని పశ్చిమ తీరంలోని లటాకియా సమీపంలో ఓ భవనం కూలిపోయిందని సిరియన్ స్టేట్ టెలివిజన్ నివేదించింది. సెంట్రల్ సిరియాలోని హమాలో అనేక భవనాలు పాక్షికంగా కూలిపోయాయని, సివిల్ డిఫెన్స్, అగ్నిమాపక సిబ్బంది శిథిలాల నుండి ప్రాణాలను బయటకు తీయడానికి కృషి చేస్తున్నారని ప్రభుత్వ అనుకూల మీడియా తెలిపింది. సిరియా జాతీయ భూకంప కేంద్రానికి హెడ్ అయిన రేద్ అహ్మద్, "చారిత్రాత్మకంగా, భూకంప కేంద్రం చరిత్రలో నమోదైన అతిపెద్ద భూకంపం ఇది" అని అన్నారు.

టర్కీలో 7.8 తీవ్రతతో భూకంపం... ఐదుగురు మృతి, అనేక భవనాలు ధ్వంసం...

టర్కీ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌తో భూకంప నిపుణుడు నాసి గోరూర్, భూకంపం వల్ల వరదలు వచ్చే  విపత్తును నివారించడానికి ఈ ప్రాంతంలోని ఆనకట్టలు పగుళ్లబారకుండా.. ఇప్పటికే ఏమైనా నష్టం జరిగిందా వెంటనే తనిఖీ చేయాలని స్థానిక అధికారులను కోరారు.

2020 జనవరిలో ఎలాజిగ్‌లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించి 40 మందికి పైగా మరణించారు. అదే సంవత్సరం అక్టోబర్‌లో, ఏజియన్ సముద్రంలో 7.0 తీవ్రతతో సంభవించిన భూకంపం 114 మందిని బలితీసుకుంది. 1,000 మందికి పైగా గాయపడ్డారు.

click me!