గర్ల్ ఫ్రెండ్ పై కోర్టుకెక్కిన యువకుడు.. ఎందుకు తెలుసా?

Published : Feb 06, 2023, 12:46 PM IST
గర్ల్ ఫ్రెండ్ పై కోర్టుకెక్కిన యువకుడు.. ఎందుకు తెలుసా?

సారాంశం

ఆమె అతన్ని బాయ్ ఫ్రెండ్ గా కాకుండా... కేవలం ఫ్రెండ్ లా చూడటం మొదలుపెట్టింది. అతనికి నచ్చలేదు. అతనేమో.... రొమాంటిక్ గా నే ఉండాలి అని అనుకున్నాడు.

ఈ రోజుల్లో ఎవరి మీద ఎవరైనా పోలీసు కేసు పెట్టొచ్చు. దానికి కారణం అక్కర్లేదు. మనో భావాలు దెబ్బతింటే చాలు... పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. తాజాగా...  ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ మీద ఏకంగా కోర్టుకెక్కాడు. తనకు రూ.18కోట్లు చెల్లించాలని అతను కోర్టులో కోరడం విశేషం. ఈ సంఘటన సింగపూర్ లో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు  ఇలా ఉన్నాయి.

ఇంతకీ మ్యాటరేంటంటే... 2016లో ఓ యువకుడికి యువతి పరిచయం అయ్యింది. నాలుగేళ్ల పాటు... వారి బంధం సజావుగానే సాగింది. కానీ... 2020లో వారి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. అప్పటి నుంచి... ఆమె అతన్ని బాయ్ ఫ్రెండ్ గా కాకుండా... కేవలం ఫ్రెండ్ లా చూడటం మొదలుపెట్టింది. అతనికి నచ్చలేదు. అతనేమో.... రొమాంటిక్ గా నే ఉండాలి అని అనుకున్నాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో... ఆమె తనతో గర్ల్ ఫ్రెండ్ లా ఉండటం లేదని.. తనకు మానసిక వేదన కలిగించినందుకు కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించాడు. దీంతో.. ఆమె అతడితో పాటూ 18 మార్లు కౌన్సెలింగ్‌కు హాజరైంది. కౌన్సెలింగ్‌తోనైనా అతడు మారతాడనే ఆశతో ఆమె ఇందుకు ఒప్పుకుంది.

కానీ.. క్వాషిగన్‌లో మార్పు లేకపోవడంతో ఆమె అతడితో సంబంధాన్ని పూర్తిగా తెంచేసుకుంది. ఆమె చర్యతో హర్ట్ అయిపోయిన అతడు చివరకు కోర్టులో కేసు వేశాడు. తమ బంధాన్ని బాగుచేసుకునేందుకు తమ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆమె ఉల్లంఘించిందంటూ ఆరోపించాడు. కానీ.. కోర్టు అతడి కేసును కొట్టేసింది. అర్థం లేని కేసు అంటూ అతనికి చివాట్లు కూడా పెట్టడం గమనార్హం.
 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే