
పోలాండ్ లో క్షిపణి దాడి వల్ల పేలుడు సంభవించింది. దీని వల్ల ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ప్రపంచతో ప్రపంచం మొత్తం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. అయితే దీనిపై నాటో మిత్రదేశాలు దర్యాప్తు చేస్తున్నాయని,రష్యా నుంచి ప్రయోగించిన క్షిపణి వల్ల ఇది సంభవించి ఉండకపోవచ్చని ముందస్తు సమాచారం సూచిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.
ఇండోనేషియాలోని బాలిలో జీ 20 శిఖరాగ్ర సమవేశం జరుగుతోంది. దీంతో ఆయా సభ్యదేశాల నాయకులు అంతా అక్కడే ఉన్నారు. పోలాండ్ లో పేలుడు సంభవించిన తరువాత వెంటనే జీ 20 నాయకులు అత్యవరస సమావేశం నిర్వహించారు. ఇందులో అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ పేలుడు రష్యా తయారు చేసిన క్షిపణుల వల్ల సంభవించినట్లు ఉక్రెయిన్, పోలిష్ అధికారులు తెలిపారు.
ఈ క్షిపణిని రష్యా నుంచి ప్రయోగించినట్లు చెప్పడం తొందరపాటు కాదా అని అడిగిన ప్రశ్నకు బైడెన్ సమాధానమిస్తూ..‘‘ దీనిపై తమ వద్ద ప్రాథమిక సమాచారం ఉంది. మేము దానిని పూర్తిగా పరిశోధిస్తాం. అప్పటి వరకు నేను అలా చెప్పదలుచుకోలేదు. కానీ అది రష్యా నుంచి వచ్చే అవకాశం అయితే లేదు. కానీ ఈ విషయం ఇంకా పరిశీలించాల్సి ఉంది ’’ అని తెలిపారు. అమెరికా, నాటో దేశాలు చర్య తీసుకునే ముందు పూర్తిగా దర్యాప్తు చేస్తాయని ఆయన అన్నారు.
పామును ముద్దాడబోతే... కసిదీరా పెదవులపై కాటేసింది.. చికిత్స తీసుకుంటూ....
ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలోని తూర్పు పోలాండ్ లోని ప్రిజెవోడో అనే గ్రామంలో జరిగిన పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించిన తరువాత బైడెన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రకటించింది. ‘‘ ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామీణ పోలాండ్ లో పేలుడుపై పోలాండ్ దర్యాప్తునకు మద్దతు ఇవ్వడానికి మేము అంగీకరించాం. ఏం జరిగిందో వారు కచ్చితంగా తెలుసుకుంటారు’’ అని బైడెన్ అన్నారు.
కాగా.. తాజాగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర అత్యవసర సమావేశంలో యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, కెనడా, నెదర్లాండ్స్, జపాన్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన నాయకులు పాల్గొన్నారు. జపాన్ మినహా మిగిలిన వారంతా నాటోలో సభ్యులుగా ఉన్నారు. ఇందులో పోలాండ్ కు కూడా సభ్యత్వం ఉంది.
మా పౌరుల మృతికి కారణం రష్యా క్షిపణే.. దీనిమీద వెంటనే వివరణ ఇవ్వాలి.. పోలాండ్ డిమాండ్..
అయితే ఇందులో పోలాండ్ పేలుడుకు రష్యా కారణం అని నిర్ణయిస్తే నాటో సామూహిక సూత్రం ఆర్టికల్ 5 ప్రకారం చర్యలు తీసుకుంటారు. దీని ప్రకారం నాటో కూటమిలోని ఒక్క సభ్య దేశంపై ఏ దేశమైనా దాడి చేస్తే.. అది ఉమ్మడి దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. దీంతో ఉమ్మడిగా ఆ దేశంపై సైనిక చర్యలు ప్రారంభమవుతాయి. అయితే ఈ దాడికి బాధ్యత వహించబోమని రష్యా తెలిపింది. దీంతో పోలాండ్ వార్సాలోని రష్యా రాయబారిని వివరణ కోసం పిలిపించింది.