BAPS Mandir : అబుదాబీలో మొట్టమొదటి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన నరేంద్ర మోడీ

Siva Kodati |  
Published : Feb 14, 2024, 07:05 PM ISTUpdated : Feb 14, 2024, 08:02 PM IST
BAPS Mandir : అబుదాబీలో మొట్టమొదటి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన నరేంద్ర మోడీ

సారాంశం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 2018లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆలయానికి పునాదిరాయి వేశారు. బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ (బీఏపీఎస్) ఈ ఆలయాన్ని నిర్మించింది. 

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయం మధ్యప్రాచ్యం, యూఏఈలోని హిందూ జనాభాకు అతి ముఖ్యమైనది. 27 ఎకరాల విస్తీర్ణంలో 108 అడుగుల ఎత్తైన ఈ ఆలయం మధ్యప్రాచ్యంలో అతిపెద్ద హిందూ దేవాలయం కానుంది. 2015లో యూఏఈ రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబు మ్రీఖా దేవాలయం కోసం 13.5 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. 2019లో మరో 13.5 ఎకరాల భూమిని విరాళం ఇవ్వగా.. ఆలయ నిర్మాణం ఘనంగా ప్రారంభమైంది. 

2018లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆలయానికి పునాదిరాయి వేశారు. బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ (బీఏపీఎస్) ఈ ఆలయాన్ని నిర్మించింది. బుధవారం ఉదయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమైంది. ఆలయాన్ని ప్రారంభించేందుకు అబు మ్రీఖాకు వెళ్లే ముందు 8 నెలల్లో మూడోసారి యూఏఈ పర్యటనకు వచ్చిన మోడీ.. ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సదస్సులో కీలక ప్రసంగం చేశారు. మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా, దుబాయ్ ఎమిర్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌లతో మోడీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. 

 

 

ప్రారంభోత్సవ అధిపతి, ప్రధాని మోడీ ఆలయ ప్రాంగణంలో గంగా , యమునా నదులలో నీటిని సమర్పించి ఆపై ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఇస్లాం అధికారిక మతమైన యూఏఈలో దాదాపు 3.6 మిలియన్ల మంది భారతీయ కార్మికులు నివసిస్తున్నారు. ఆలయంలో ప్రారంభోత్సవ వేడుకకు భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు, బాలీవుడ్ తారలు, ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. యూఏఈలో భారత మాజీ రాయబారి నవదీప్ సూరి మాట్లాడుతూ.. భారతీయ సమాజానికి ఇది చాలా ప్రతీకాత్మకమైన రోజు అన్నారు.  

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే