
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఇటలీ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం ఉదయం ఆయన రోమ్(Rome) నగరానికి చేరుకున్నారు. అక్కడ మోదీకి ఘన స్వాగతం లభించింది. నేటి నుంచి అక్టోబర్ 31 వరకు ఆయన రోమ్, వాటికన్ సిటీలలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా మోదీ జీ20 సమ్మిట్‌లో (G20 Summit) పాల్గొననున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్, ఇండోనేషియా, సింగపూర్, జర్మనీ దేశాధినేతలతో ద్వైపాక్షికంగా భేటీ కానున్నారు. అంతేకాకుండా వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిన్‌తో సమావేశం కానున్నారు. అనంతరం మోదీ యూకే బయలుదేరి వెళ్తారు. నవంబర్ 1న గ్లాస్గోలో జరిగే కాప్ 26 సమావేశంలో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో బ్రిటన్ ప్రధాని బోరిస్‌తో మోదీ భేటీ కానున్నారు. అనంతరం నవంబర్ 3వ తేదీన మోదీ తిరిగి భారత్‌కు చేరుకోనున్నారు.
Also read: కేటీఆర్ సార్! మీరు గైడ్ చేస్తారని ఆశిస్తున్నా.. వైరల్ అవుతున్న యాంకర్ అనసూయ ట్వీట్..
దాదాపు 12 ఏళ్ల తర్వాత రోమ్‌లో పర్యటిస్తున్న భారత తొలి ప్రధాని మోదీనే అని Italyలోని భారత రాయబారి నీనా మల్హోత్రా తెలిపారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటలీ ప్రభుత్వ సీనియర్ అధికారులు, ఇటలీలోని భారత రాయబారి రోమ్‌లో ఘనస్వాగతం పలికారు’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘కీలకమైన ప్రపంచ సమస్యలపై చర్చించడానికి ముఖ్యమైన వేదిక అయిన జీ20 సమ్మిట్‌లో పాల్గొనడానికి రోమ్‌లో అడుగుపెట్టాను. ఈ రోమ్ పర్యటనలో నేను ఇతర కార్యక్రమాలలో కూడా పాల్గొంటాను’ అని రోమ్‌లో ల్యాండ్ అయిన తర్వాత మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Also raed: Huzurabad bypoll: ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ ఫిర్యాదులపై ఈసీ ఆరా
‘ఇటలీ ప్రధాని మారియో ద్రాగి ఆహ్వానం మేరకు అక్టోబర్ 29 నుంచి 31 వరకు రోమ్ మరియు వాటికన్ సిటీలను సందర్శించనున్నాను. ఆ తర్వాత బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఆహ్వానం మేరకు నవంబర్ 1 నుంచి బ్రిటన్‌లోని గ్లాస్గోకు వెళ్లనున్నాను’అని మోదీ గురువారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Also read: ఐక్యరాజ్యసమితిలో డైనోసార్ ప్రసంగం.. ఇప్పటికైనా మారాలని ప్రపంచ దేశాలకు మెసేజ్..
కోవిడ్ మహమ్మారి వ్యాప్తి మొదలైన తర్వాత G20 మొదటి వ్యక్తిగత శిఖరాగ్ర సమావేశం ఇదేనని మోదీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం ప్రపంచంలోని పరిస్థితులను సమీక్షించడానికి, ఆర్థిక స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి సంబంధించిన అంశాలను చర్చించనున్నట్టుగా మోదీ తెలిపారు. మహమ్మారి నుంచి కోలుకుని స్థిరంగా తిరిగి పరిస్థితులును మార్చుకోవడానికి ఎలాంటి విధానాలను అవలంభించాలనే ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి ఈ సమిట్ వేదికగా నిలవనుందని మోదీ అన్నారు.