ఐకరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలు జరుగుతుండగా.. అక్కడికి ఓ అరుదైన అతిథి వచ్చింది. నేరుగా పోడియం వద్దకు వెళ్లి.. పర్యావరణంపై ప్రపంచ నాయకులకు, దౌత్యవేత్తలకు సూచనలు చేసింది. వినాశానాన్ని ఎంచుకోవద్దని.. ఆలస్యం కాకముందే మానవ జాతులను రక్షించాలని ఉద్భోదించింది.
ఐకరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలు జరుగుతుండగా.. అక్కడికి ఓ అరుదైన అతిథి వచ్చింది. నేరుగా పోడియం వద్దకు వెళ్లి.. పర్యావరణంపై ప్రపంచ నాయకులకు, దౌత్యవేత్తలకు సూచనలు చేసింది. వినాశానాన్ని ఎంచుకోవద్దని.. ఆలస్యం కాకముందే మానవ జాతులను రక్షించాలని ఉద్భోదించింది. ఇంతకీ ఆ అతిథి ఎవరని అనుకుకుంటున్నా.. కొన్ని వేల ఏళ్ల కిందట అంతమైన డైనోసర్ (Dinosaur). అదేంటి డైనోసార్ రావడం ఏమిటని అనుకుంటున్నారా.. అయితే మీరు ఈ స్టోరి చదవాల్సిందే. ఐకరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (UN General Assembly) కొనసాగుతుంది. 193 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. సభ జరుగుతున్న సమయంలో ఇంతలో తలుపు వద్ద నుంచి ఓ భారీ డైనోసర్ నడుచుకుంటూ వచ్చింది. అక్కడున్నవారు అంతా ఉలిక్కిపడ్డారు. నేరుగా పోడియం వద్దకు వెళ్లిన డైనోసర్ వాతావరణ మార్పులపై మానవాళిని ఉద్దేశించి ప్రసంగించింది.
Also raed: Huzurabad bypoll: ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ ఫిర్యాదులపై ఈసీ ఆరా
undefined
అయితే ఇదంతా పర్యావరణ మార్పులపై అవగాహన కోస ఐరాస గ్రాఫిక్ డిజైన్‌తో రూపొందించిన మాయ. ఐరాస చేపట్టిన ‘వినాశనాన్ని ఎంచుకోకండి’ అనే క్యాంపెయిన్‌లో భాగంగా దీన్ని ట్విటర్ ద్వారా విడుదల చేసింది. అయితే నిజంగా Dinosaur వచ్చి మాట్లాడినట్టుగా దీనిని డిజైన్ చేశారు.
Also read: విశాఖపట్నం సీలేరు నుంచి హైదరాబాద్‌కు గంజాయి.. 70 కిలోలు స్వాధీనం..
‘అంతరిక్షం నుంచి వచ్చిన గ్రహశకలాలు ఢీ కొనడం వల్ల మేము అంతరించిపోయాం. మేం అంతరించిపోవడానికి కనీసం ఒక్క కారణం ఉంది. కానీ మీరు ఏమి చేస్తున్నారు..? మీరు పర్యావరణ విపత్తు వైపు వెళుతున్నారు. శిలాజ ఇంధనాలపై సబ్సిడీ కోసం ప్రభుత్వాలు ఇంకా ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నాయి. 70 మిలియన్ సంవత్సరాలలో ఇది నేను విన్న అత్యంత హాస్యాస్పదమైన విషయం. ఆ ప్రజా ధనాన్ని ప్రపంచవ్యాప్తంగా పేదరికంలో ఉన్నవారి కోసం ఎందుకు ఖర్చు చేయడం లేదు.
మీ జాతి వినాశానికి మీరే డబ్బులు ఖర్చు చేస్తున్నారు. మీరు మీ ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించుకుని.. ఈ మహమ్మారి నుండి తిరిగి పుంజుకున్నందున మీకు ప్రస్తుతం గొప్ప అవకాశం లభించింది. అందుకే మీకు నేను ఒక సలహా ఇస్తున్నాను.. వినాశనాన్ని ఎంచుకోకండి.. ఆలస్యం కాకముందే మీ జాతిని కాపాడుకోంది. సాకులు చెప్పడం మానేసి.. మార్పుల కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది’అని ఐరాస డిజైన్ చేసిన డైనోసార్ ప్రసంగించింది.
Also read: ఆన్‌లైన్‌లో పోస్ట్ పెట్టి.. మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం.. అదే కారణమా..?
ఇక, యూఎన్‌డీపీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. వినియోగదారుల కోసం శిలాజ ఇంధనాలకు సబ్సిడీ ఇవ్వడానికి ప్రపంచం ఏడాదికి 423 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది. ఇది ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి COVID-19 టీకాల వేయించడానికి అవసరమయ్యే ఖర్చుతో సమానం. లేదా ప్రపంచ పేదరికాన్ని నిర్మూలించడానికి అవసరమైన వార్షిక మొత్తానికి మూడు రెట్లు చెల్లించవచ్చు.