Boris Johnson Fined: క‌రోనా నిబంధనల అతిక్రమణ.. బ్రిటన్ ప్రధాని, ఆర్థిక మంత్రికి జరిమానా..

Published : Apr 13, 2022, 01:04 AM IST
Boris Johnson Fined:  క‌రోనా నిబంధనల అతిక్రమణ.. బ్రిటన్ ప్రధాని, ఆర్థిక మంత్రికి జరిమానా..

సారాంశం

Boris Johnson Fined: క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆర్థిక మంత్రి రిషి సునక్‌లకు అధికారులు జరిమానా విధించబోతున్నారు.  వీరిద్దరికీ మెట్రోపాలిటన్ పోలీసులు ఫిక్స్‌డ్ పెనాల్టీ నోటీసులు పంపించేందుకు రంగం సిద్ధం చేశారు.  

Boris Johnson Fined:  ప్ర‌స్తుతం మ‌రోసారి ప్ర‌పంచ దేశాల్లో కరోనా మహమ్మారి విభృంభిస్తోంది. మ‌నవాళికి కంటి మీద కునుకు లేకుండా విజృంభిస్తోంది. ఈ క్ర‌మంలో ప‌లు దేశాలు క‌రోనా నివార‌ణ‌కు ఆంక్ష‌లు విధిస్తున్నాయి. ఈ నిబంధ‌నల కార‌ణంగా.. ఆర్థిక పరిస్థితులు తలకిందులుగా మారిపోయాయి. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జా ఆరోగ్యానికి పెద్ద‌పీట వేస్తూ..  కొన్ని దేశాలు కఠిన ఆంక్షలను పాటిస్తున్నాయి. ఈ క్రమంలో చిన్న‌, పెద్ద తేడా లేకుండా.. అంద‌రికి ఒకేలా వ‌ర్తించలే.. లాక్ డౌన్ నిబంధలను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నాయి. ఇక కరోనా కొత్త కొత్త వేరియంట్ లతో ప్రపంచంపై విరుచుకు పడుతుంది. అనేక దేశాలు బయటి దేశాల నుంచి రాకపోకలను పూర్తిగా నిషేధించాయి.

ఇదిలాఉంటే.. చైనాలో  మ‌రోసారి కరోనా  తన విశ్వ‌రూపాన్ని చూపిస్తోంది. అక్కడ అడ్డు.. అదుపు లేకుండా.. ప్రతి రోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే అక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. సాధారణ ప్రజల నుంచి ప్ర‌ముఖుల వరకు లాక్ డౌన్ నిబంధలు పాటించాల్సిందే... ఇక కొన్ని దేశాలు మాత్రం లాక్ డౌన్ నిబంధలను ఇప్పటికి కఠినంగా అమలు చేస్తున్నాయి. ఈ కోవ‌కు చెందిందే.. బ్రిటన్..

 క‌రోనా నిబంధ‌లు అమ‌ల్లో  కఠినంగా.. వ్య‌వ‌హ‌రిస్తోంది. నిబంధ‌ల‌ను ఉల్లంఘిస్తే..  దేశ ప్రధానిని సైతం లెక్క చేయ‌కుండా.. జ‌రిమానా విధిస్తున్నారు. గ‌తంలో ప్ర‌ధాని  బోరిస్ జాన్సన్, ఆర్థిక మంత్రి రిషి సునక్ లు లాక్ డౌన్ ఉల్లంఘించారని వారిపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు.

లాక్ డౌన్ సమయంలో నిబంధలను విరుద్దంగా పార్టీగేట్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారన్న అభియోగాల మీద వీరికి పెనాల్టీ నోటిసులు జారీ చేయనున్నారు. అయితే, అక్కడి ప్రతి పకాలు ఒక అడుగు ముందుకు వేసి బ్రిటన్ ప్రధాని, మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. బ్రిటన్ అధికారులు విచారణలో ఇరువురు నిబంధలను ఉల్లంఘించారని తెలింది. దీంతో వీరికి నోటిసులు పంపడానికి అధికారులు సిద్దపడ్డారు.

 దీనిపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పందించారు. తాను కరోనా నిబంధనలు పాటించానని తెలిసి.. ఏ తప్పు చేయలేదని అన్నారు. బోరిస్ జాన్సన్  భార్య పై  కూడా జరిమాన విధిస్తున్నట్లు తెలుస్తోంది.  2021 లో లాక్ డౌన్ నిబంధనల తర్వాత.. ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన క్షమాపణలు కూడా తెలిపారు. రష్యా దాడులను ఎదుర్కొవడానికి , బోరిస్ జాన్సన్ ఆయుధాలు, ఇతన సహాకారాన్ని అందిస్తు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే