Metal Boxesలో కోవిడ్ పేషెంట్స్.. గర్బిణీలు, పిల్లలు కూడా.. అక్కడ ఇంత కఠినమా?.. వైరల్ అవుతున్న వీడియోలు..

By Sumanth KanukulaFirst Published Jan 13, 2022, 12:47 PM IST
Highlights

గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలను కరోనా వైరస్ (Coronavirus) వణికిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త కొత్త వేరియంట్‌లుగా పరివర్తనం చెందుతూ ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్‌ను పూర్తిగా నిర్మూలించడం అసాధ్యమని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చైనా (China) మాత్రం ఎప్పటిలాగే డిఫరెంట్ రూట్‌ను ఎంచుకుంది. 

గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త కొత్త వేరియంట్‌లుగా పరివర్తనం చెందుతూ ఆందోళన కలిగిస్తోంది. అయితే తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా చాలా దేశాలలలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్‌ను పూర్తిగా నిర్మూలించడం అసాధ్యమని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చైనా (China) మాత్రం ఎప్పటిలాగే డిఫరెంట్ రూట్‌ను ఎంచుకుంది. కోవిడ్‌ను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంగా జీరో-కోవిడ్ విధానాన్ని (zero Covid policy) తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కఠిన చర్యలు అమలు చేస్తూ కోవిడ్‌ను నిర్మూలించాలని చూస్తుంది. 

అయితే ఇందుకోసం చైనా తీసుకుంటున్న చర్యలు.. చాలా కఠినంగా, హృదయవిదారకంగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఈ పాలసీలో భాగంగా చైనా ప్రభుత్వం.. కోవిడ్ సోకినవారిని, వారి కాంటాక్టులను మెటల్ బాక్స్‌ల్లో (metal boxes) ఉంచుతుంది. ఈ మేరకు చైనా ప్రజలను అక్కడి ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని డైలీ మెయిల్ రిపోర్ట్ చేసింది. 

ప్రస్తుతం ఇందుకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడుతున్నాయి. ఆ వీడియోలు జియాన్, అన్యాంగ్, యుజౌల ప్రాంతాల్లోని పరిస్థితికి అద్దం పడుతున్నాయని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఓమిక్రాన్ కేసులు (Omicron) నమోదైన తర్వాత అక్కడి అధికారులు ఈ చర్యలు చేపట్టినట్టుగా చెబుతున్నారు. అయితే వీడియోల్లో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. పెద్ద గ్రౌండ్స్‌లో భారీగా మెటల్ బాక్స్‌లను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున మెటల్ బాక్స్ వరుసలను వీడియోల్లో చూడొచ్చు. ఒక్కో మెటల్ బాక్స్‌లో.. చెక్క బెడ్డుతో పాటు టాయిలెట్‌ను అందుబాటులో ఉంటుంది. 

 

Millions of chinese people are living in covid quarantine camps now!
2022/1/9 pic.twitter.com/wO1cekQhps

— Songpinganq (@songpinganq)

కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ  అయిన వ్యక్తిని మాత్రమే  కాకుండా.. అతని కాంటాక్టులు, ఆ ప్రాంతంలో ఉంటున్న వారందరినీ మెటల్ బాక్స్‌లు ఉన్న ప్రాంతాలకు తరలిస్తున్నారు. కేవలం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ఈ తరలింపు కార్యక్రమం చేపడుతున్నారు. వారిలో గర్బిణులు, పిల్లలు, వృద్దులు ఎవరైనా సరే మెటల్ బాక్స్‌‌ల్లో ఉండాల్సి వస్తుందని డెయిలీ మెయిల్ పేర్కొంది. రెండు వారాల పాటు ఆ పరిమిత ప్రాంతంలో ఒంటరిగా గడపాల్సి ఉంటుందని తెలిపింది. 

వచ్చే నెలలో వింటర్ ఒలంపిక్స్‌కు బీజింగ్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్దమవుతుండం, Lunar New Year సమీపిస్తుండటంతో.. ఇప్పటికే కోవిడ్ నిరోధించడానికి కఠిన చర్యలు అమలు చేస్తున్న చైనా మరింత కఠినంగా వ్యవహరిస్తుంది. 

click me!