అమెరికా అందుకు చేరువలో ఉంది.. వైరస్‌ను నిర్మూలించడానికి మార్గం లేదు.. ఆంథోని ఫౌసీ కామెంట్స్

By Sumanth KanukulaFirst Published Jan 12, 2022, 12:01 PM IST
Highlights

అమెరికాలో కరోనా కేసులు (Corona cases) రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్‌ అక్కడ ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. క్రమంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంథోనీ ఫౌసీ (Anthony Fauci) కీలక వ్యాఖ్యలు చేశారు. 
 

అమెరికాలో కరోనా కేసులు (Corona cases) రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్‌ అక్కడ ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. క్రమంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే ఆస్పత్రులలో సిబ్బంది కొరత ఏర్పడుతుంది. అమెరికాలో 1,200 ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది కొరత ఏర్పడినట్టుగా గణంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంథోనీ ఫౌసీ (Anthony Fauci) కీలక వ్యాఖ్యలు చేశారు. 

అమెరికా కరోనా వైరస్‌తో జీవించే స్థాయికి చేరువలో ఉందని ఆంథోని ఫౌసీ మంగళవారం తెలిపారు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS)తో  ఆయన మాట్లాడుతూ.. కోవిడ్‌ను పూర్తిగా నిర్మూలించడమనేది అవాస్తమని అన్నారు. ఒమిక్రాన్ అసాధారణంగా వ్యాప్తి చెందుతుందని.. అది చివరకు ప్రతి ఒక్కరిని చేరుతుందని చెప్పారు. 

‘వైరస్ వ్యాప్తి, కొత్త రకాల పరివర్తన చెందే ధోరణి, పెద్ద సంఖ్యలో ప్రజలు టీకాలు వేయించుకోకపోవడం వల్ల.. మేము వైరస్‌ను నిర్మూలించడానికి మార్గం లేదు’ అని ఆంథోని ఫౌసీ తెలిపారు. అయితే ముందుగానే టీకాలు వేయించుకున్న తీవ్రమైన ఫలితాల నుంచి రక్షించబడ్డారని అన్నారు. అయితే ఇన్‌ఫెక్షన్‌ను‌ ఎదుర్కొనే క్రమంలో టీకా సామర్థ్యం పడిపోయిందని చెప్పారు. 

‘దేశంలో Omicron కేసులు పెరగడం, తగ్గడం జరుగుతుంది. దేశం కొత్త దశలోకి ప్రవేశిస్తుందని ఆశిస్తున్నాము. ఇక్కడ ప్రజలు వైరస్ నుంచి తగినంత రక్షణను కలిగి ఉంటారు. తగినంత మందులు అందుబాటులో ఉంటాయి. తద్వారా ఎవరికైనా వైరస్ సోకి.. హై రిస్క్ గ్రూపులో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి చికిత్స చేయడం చాలా సులభం’ అవుతుందని ఆంథోని ఫౌసీ చెప్పారు. వ్యాధిని తట్టుకొని మనిషి మనుగడ సాగించే స్థితికి అమెరికా వెళ్తుంది.. తాము ప్రస్తుతం దానికి చేరువలో ఉండవచ్చు అని వ్యాఖ్యానించారు. 

ఇక, అమెరికాలో ప్రస్తుతం రోజుకు దాదాపు మిలియన్ కేసులు నమోదవుతున్నాయని, రోజుకు 1,200 మరణాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. దాదాపు 1.5 లక్షల మంది ఆస్పత్రులలో ఉన్నారని చెప్పారు. 

click me!