coronavirus: కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో అయితే, రోజురోజుకూ పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. నిత్యం లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో అమెరికాలో ఏకంగా 11లక్షల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.
coronavirus: కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ప్రమాదకరమై.. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron variant) పంజా విసురుతోంది. దీంతో కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దాదాపు అన్ని దేశాలకు వ్యాపించిన coronavirus ఒమిక్రాన్ వేరియంట్.. ఆయా దేశాల్లో పరిస్థితులను దారుణంగా మారుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ తో పాటు COVID-19 డెల్టా వేరియంట్ కూడా ప్రస్తుతం విజృంభిస్తుండటంతో పలు దేశాల్లో ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితులు దాపురించాయి. అగ్రరాజ్యం అమెరికాలో అయితే, రోజురోజుకూ పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. నిత్యం లక్షల్లో coronavirus కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో అమెరికాలో ఏకంగా 11లక్షల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు జనవరి 3న ఒకేరోజు 10లక్షల మంది కరోనా బారినపడ్డారు. రోజువారీ కేసుల్లో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ ఇన్ని COVID-19 కేసులు నమోదు కాలేదు. కరోనా (coronavirus) కొత్త కేసులతో పాటు మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి కోవిడ్ రెండు డోసుల టీకాలు తీసుకున్న వారితో పాటు బూస్టర్ డోసులు అందుకున్న వారు సైతం అధికంగా కరోనా బారినపడటంపై బైడెన్ సర్కారు అందోళన వ్యక్తం చేస్తున్నది.
కరోనా వైరస్ బారినపడుతున్న వారు క్రమంగా పెరుగుతున్నారు. అలాగే, ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య సైతం అధికంగా నమోదవుతున్నది. ముఖ్యంగా వాషింగ్టన్ డీసీ, విస్కాన్‌సిన్, వర్జీనియా, డెలావేర్, ఇలినోయిస్, మేరీల్యాండ్, మిస్సౌరి, పెన్సిల్వేనియాతోపాటు పలు రాష్ట్రాల్లో ఆస్పత్రి చేరికలు క్రమంగా పెరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. దీనికి తోడు కొత్తగా COVID-19 బారినపడుతున్న వారిలో అధికంగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఉంటున్నారు. వీరిలో స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవైపు కరోనా వైరస్ కేసులు పెరగడం.. వారిలో వైద్యులు, ఆరోగ్య కార్యర్తలు అధికంగా ఉండటంతో ఆరోగ్య వ్యవస్థ ఒత్తిడికి గురవుతున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. మున్ముందు కరోనా వైరస్ (COVID-19) విజృంభణ.. ఆస్పత్రలుల్లో చేరికలు ఇలాగే కొనసాగితే.. ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే పరిస్థితులు దాపురిస్తాయని విశ్లేషకులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వైరస్ వెలుగుచూసినప్పటి నుంచి ఒక్క అమెరికాలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి. కరోనా టీకాలు అందించిన దేశాల్లో అమెరికా టాప్ లో ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ విజృంభణతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటం గమనార్హం. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 311,378,882 కరోనా కేసులు (COVID-19) నమోదుకాగా, అందులో 62,661,272 కేసులు ఒక్క అమెరికాలోనే నమోదయ్యాయి. అలాగే, యూఎస్‌లో ఇప్పటివరకు కరోనా కారణంగా 861,336 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా సోకిన వారిలో 42,505,374 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 19,294,562 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 23,337 క్రిటికల్ కేసులు ఉన్నాయని అమెరికా ఆరోగ్య శాక వర్గాలు వెల్లడించాయి. అమెరికాలో నమోదవుతున్న కొత్త కేసుల్లో అత్యధికం కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant) కేసులు అధికంగా ఉంటున్నాయని వైద్య నిపుణులు, విశ్లేషకులు పేర్కొంటున్నారు.