ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న పాక్ నాయకులు

Published : May 30, 2025, 08:25 PM IST
pakistan

సారాంశం

ఉగ్రవాదులతో పాకిస్థాన్ సంత్సంబంధాలు మరోసారి బైటపడ్డాయి. తాజాగా మరోసారి రాజకీయ నాయకులు ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Islamabad: పహల్గాం దాడి సూత్రధారితో సహా పలువురు ఉగ్రవాదులతో పాక్ నాయకులు వేదిక పంచుకున్న దృశ్యాలు బయటపడ్డాయి. పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సైఫుల్లా కసూరితో సహా పలువురు ఉగ్రవాదులతో పాక్ నాయకులు వేదిక పంచుకున్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లో మే 28న జరిగిన యోమ్-ఇ-తక్బీర్ వేడుకల్లో పాక్ నాయకులు ఉగ్రవాదులతో వేదిక పంచుకున్నారు. 

జాతీయ అసెంబ్లీ సభ్యుడు మాలిక్ రషీద్ అహ్మద్ ఖాన్, పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ మాలిక్ ముహమ్మద్ అహ్మద్ ఖాన్, పిఎంఎల్ (ఎన్) నాయకురాలు మరియం నవాజ్  పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. లష్కర్ కమాండర్లు సైఫుల్లా కసూరి, తల్హా సయీద్, అమీర్ హంజా వంటి ఉగ్రవాదులు వీరితో పాటు వేదికపై ఉన్నారు. 

ఉగ్రవాదులతో పాక్ ప్రభుత్వం, నాయకుల సంబంధాల గురించి అన్ని ఆరోపణలను పాకిస్తాన్ ఖండిస్తోంది. కానీ ఉగ్రవాదులతో పాక్ సంబంధాలు, వాటిని నిరూపించే ఇలాంటి చిత్రాలు బయటపడుతూనే ఉన్నాయి. గతంలో ఆపరేషన్ సిందూర్ లో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ అధికారులు పాల్గొన్న వీడియోలు, ఫోటోలు ఇలాగే బయటకు వచ్చాయి. ఇఫ్పుడు రాజకీయ నాయకులు, ఉగ్రవాదులు ఒకే వేదికపై ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే