పాకిస్తానీలను వెనక్కి పంపేస్తున్న భారత్... ప్రయాగ్ రాజ్ లో పాక్ మహిళలు, వీసాలు రద్దు

Published : Apr 26, 2025, 01:18 PM ISTUpdated : Apr 26, 2025, 01:59 PM IST
పాకిస్తానీలను వెనక్కి పంపేస్తున్న భారత్...  ప్రయాగ్ రాజ్ లో పాక్ మహిళలు, వీసాలు రద్దు

సారాంశం

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం అన్ని పాకిస్తానీ వీసాలను రద్దు చేసింది. ఈ క్రమంలోనే ప్రయాగరాజ్ నుండి పాకిస్తానీ మహిళలను వెనక్కి పంపిస్తున్నారు, ఇతర రాష్ట్రాల్లో కూడా చర్యలు కొనసాగుతున్నాయి.

Pakistan Visa Cancellation: ఇండియా-పాకిస్తాన్ సంబంధాల్లో మళ్ళీ ఉద్రిక్తత నెలకొంది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ లో నివసిస్తున్న పాకిస్తానీలపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. పాకిస్తానీ పౌరుల వీసాలను రద్దు చేసింది...  అనుమతి కంటే ఎక్కువ రోజులు పాకిస్ధానీలు ఉండకూడదని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెంటనే యాక్షన్ లోకి దిగింది.

ప్రయాగరాజ్ నుండి పాకిస్తానీ మహిళలు వెనక్కి

ప్రయాగరాజ్ నుండి శుక్రవారం ఒక పాకిస్తానీ మహిళను, శనివారం మరో ముగ్గురు మహిళలను వెనక్కి పంపారు. పోలీస్ కమిషనర్ తరుణ్ గాబా మాట్లాడుతూ “ఒక పాకిస్తానీ మహిళ శుక్రవారం వెళ్ళిపోయింది, మరో ముగ్గురు మహిళలతో మాట్లాడాం, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు” అని చెప్పారు. వీళ్ళందరూ షార్ట్ టర్మ్ వీసాపై వచ్చారని, వీరిలో ఒకరు వైద్యం కోసం వచ్చారని తెలిపారు. భద్రతా సంస్థలు వీరిని నిరంతరం గమనిస్తున్నాయని ఆయన తెలిపారు.

ప్రయాగరాజ్ లో కేవలం నలుగురు పాకిస్తానీలే

ప్రయాగరాజ్ జిల్లాలో కేవలం నలుగురు పాకిస్తానీ పౌరులు మాత్రమే ఉన్నారని, వారందరినీ వెనక్కి పంపిస్తున్నామని తరుణ్ గాబా స్పష్టం చేశారు. “మేము స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్ (LIU) తో నిరంతరం టచ్ లో ఉన్నాం, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం” అని ఆయన అన్నారు.

అమిత్ షా స్వయంగా సీఎంలకు ఫోన్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి, పాకిస్తానీ పౌరులను వెంటనే వెనక్కి పంపాలని ఆదేశించారు. భారత ప్రభుత్వం గురువారం పాకిస్తానీ పౌరులకు జారీ చేసిన అన్ని వీసాలను ఏప్రిల్ 27, 2025 నుండి రద్దు చేసింది. ఇక్కడ ఉన్న పాకిస్తానీలను వెంటనే వెళ్ళిపోవాలని, పాకిస్తాన్ లో ఉన్న భారతీయులు కూడా తిరిగి రావాలని సూచించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే
Putin walking style: పుతిన్ న‌డిచేప్పుడు కుడి చేయి ఎందుకు కదలదు.? ఏదైనా స‌మ‌స్యా లేక..