India Pakistan War : ఈ రాత్రి యుద్ధానికి గట్టిగా సిద్ధమవుతున్న పాకిస్తాన్.. అసలు ఏం చేస్తోందో తెలుసా?

Published : May 09, 2025, 10:50 AM IST
India Pakistan War : ఈ రాత్రి యుద్ధానికి గట్టిగా సిద్ధమవుతున్న పాకిస్తాన్.. అసలు ఏం చేస్తోందో  తెలుసా?

సారాంశం

పాకిస్తాన్ రైల్వేలు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించగా, సైనిక అవసరాల కోసం ప్రత్యేక రోలింగ్ స్టాక్‌ను సిద్ధం చేశారు.  

భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, పాకిస్తాన్ రైల్వే దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ఫ్రకటించింది. రైల్వేలు తమ రోలింగ్ స్టాక్‌ను (వాగన్లు, కోచ్‌లు, లోకోమోటివ్‌లు మొదలైనవి) సైనిక అవసరాల కోసం సిద్ధం చేశాయి. ఈ మేరకు అక్కడి ప్రధాన మీడియా డాన్ వెల్లడించింది.మేము సాయుధ దళాలతో సమన్వయంలో ఉన్నాం. వారు ఎప్పుడైనా అవసరం ఉంటే, రవాణా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేకంగా రూపొందించిన రోలింగ్ స్టాక్‌ను వారికోసం కేటాయించాం," అని PR చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమీర్ అలీ బలోచ్ తెలిపారు.

"వారు తరలించాలని చెప్పిన వెంటనే మేము చర్య తీసుకుంటాం. మేము సిద్ధంగా ఉన్నాం, మా దళాల పక్కన నిలబడతాం," అని ఆయన అన్నారు.ప్రస్తుతం PR ప్యాసింజర్, ఫ్రెయిట్ రైళ్ల కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. అయినప్పటికీ, రైలు స్టేషన్లు, రైళ్లను హై అలర్ట్‌పై ఉంచారు. విమానాల సేవలు నిలిపివేయబడిన సమయంలో ప్రజలు ట్రైన్లను ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉండడంతో, ప్రయాణికుల రవాణాలో ఎటువంటి ఆటంకం కలుగకుండా చూసుకుంటామని ఆయన అన్నారు.

"విమానాలలో ప్రయాణించే వారికి మేము రైళ్లలో మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఏ సేవా తగ్గింపులు చేయడం లేదు," అని బలోచ్ స్పష్టం చేశారు. ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచినట్టు తెలిపారు.ఇక, లాహోర్ నగర పాలన అధికారులూ హై అలర్ట్ ప్రకటించారు. రెస్క్యూ 1122 ఆసుపత్రులు, ఇతర అధికార విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సయ్యద్ మూసా రజా ఆదేశించారు. అలాగే డీసీ కార్యాలయంలో కేంద్ర కన్ట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పౌరుల భద్రత కోసం పర్యవేక్షణ చర్యలు చేపట్టారు.ADC (ఫైనాన్స్ & ప్లానింగ్) ముదస్సిర్ నవాజ్ నేతృత్వంలో అధికారులు, సిబ్బంది భారత దాడులకు తగిన స్పందననిచ్చిన సాయుధ దళాలకు ఘన నివాళులు అర్పిస్తూ ర్యాలీ నిర్వహించారు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే