మరోసారి నవ్వులపాలైన పాక్ డిప్యూటీ పీఎం .. ఫేక్ న్యూస్ బండారం బైటపెట్టింది పాక్ మీడియా

Published : May 16, 2025, 10:33 AM ISTUpdated : May 16, 2025, 10:45 AM IST
మరోసారి నవ్వులపాలైన పాక్ డిప్యూటీ పీఎం .. ఫేక్ న్యూస్ బండారం బైటపెట్టింది పాక్ మీడియా

సారాంశం

పాకిస్తాన్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ మరోసారి నవ్వులపాలయ్యారు. ఆయన ఇటీవల  బ్రిటీష్ మీడియా 'ది డైలీ టెలిగ్రాఫ్' పాక్ ఎయిర్ ఫోర్స్ ను పొగుడుతూ కథకం ప్రచురించిందని ఏకంగా పాక్ సెనెట్ లో ప్రస్తావించారు. అయితే ఇది నకిలీ క్లిప్పింగ్ అని స్వయంగా పాక్ మీడియానే బైటపెట్టడంతో ఇషాక్ దార్ తప్పుడు ప్రచారం గురించి బైటపడింది. 

పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్ మరోసారి నవ్వులపాలయ్యాడు. ఓ ఫేక్ న్యూస్ ని అధికారిక వేదికపై ప్రస్తావించడమే కాకుండా... దానిని అంతర్జాతీయ స్థాయి ప్రశంసగా ప్రజలకు చెప్పడం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. బ్రిటిష్ పత్రిక ది డైలీ టెలిగ్రాఫ్ లో "పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ ఆకాశంలో ఎదురేలేని రారాజు (Pakistan Air Force is the undisputed king of the skies" అని పేర్కొన్నట్లు దార్ పాకిస్థాన్ సెనెట్‌లో గురువారం ప్రకటించారు.

గురువారం పాక్ విదేశాంగ మంత్రి ధార్ సెనెట్ లో మాట్లాడుతూ.. టెలిగ్రాఫ్ లో పాక్ ఎయిర్ ఫోర్స్ ను గొప్పగా పొగుడుతూ ఓ కథనాన్ని రాసిందని ప్రస్తావించాడు. పాకిస్థాన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 6 ఫైటర్ జెట్స్ కూల్చేసినట్లు... ఇది భారత్ జీర్ణించుకోలేకపోతోందని కూడా పేర్కొన్నాడు. ఇలా పాక్ ఎయిర్ ఫోర్స్ చాలా బలంగా ఉందంటూ ధార్ గొప్పలు చెప్పుకున్నాడు. 

అయితే అతడు ఏదయితే టెలిగ్రాఫ్ లో పాక్ ఎయిర్ ఫోర్స్ ను పొగుడుతూ వచ్చిందన్న కథనాన్ని పేర్కొన్నాడో అది ఫేక్ గా తేలింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ కే చెందిన ప్రముఖ మీడియా సంస్థ డౌన్ న్యూస్ బైటపెట్టింది. టెలిగ్రాఫ్ పేరిట ప్రచారంలో ఉన్న వార్త ఫేక్ అని... దీన్ని ది డైలీ టెలిగ్రాఫ్ పేరిట ఎవరో మార్ఫింగ్ చేసారని పాక్ మీడియా తెలిపింది. ఇలా సోషల్ మీడియాలో ప్రచారమయ్యే సమాచారాన్ని ఇషాద్ దార్ రాజ్యాంగబద్ద వేదికలపై నిలబడి ప్రస్తావించి నవ్వులపాలయ్యాడు. 


 
దీంతో సోషల్ మీడియాలో దార్ వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది... ప్రభుత్వంలో ఉన్నతస్థానంలో ఉన్నవ్యక్తి ఇలాంటివి ఉపయోగించడం వల్ల దేశమే ప్రాధాన్యత కోల్పోతుందని పలువురు విమర్శించారు. అంతేకాదు ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ ప్రభుత్వ  విధానాలపై అనేక అనుమానాలు కలిగిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. 

ఇలాంటి తప్పుడు సమాచారాన్ని అధికారిక వేదికలపై పేర్కొనడం వల్ల అంతర్జాతీయంగా పాకిస్థాన్ ప్రతిష్ఠను నష్టపరిచే ప్రమాదం ఉన్నదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం దార్ వ్యాఖ్యలు నకిలీగా తేలడంతో ప్రభుత్వ స్థాయిలో ఎటువంటి సమాధానం వస్తుందో చూడాల్సి ఉంది.

ఫ్యాక్ట్ చెక్ లో బైటపడ్డ పేక్ ఆర్టికల్ : 

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్ పేర్కొన్న  బ్రిటిష్ పత్రిక ది డెయిలీ టెలిగ్రాఫ్ కథనం నకిలీదే అని పాకిస్థాన్ మీడియా సంస్థ డౌన్ న్యూస్ నిజ నిర్ధారణ (Fact check) స్పష్టం చేసింది. ఇండియా, పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో అంటే మే 10న సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ నకిలీ వార్తా చిత్రాన్ని మా బృందం శాస్త్రీయంగా పరిశీలించిందని డౌన్ న్యూస్ తెలిపింది.

ది డెయిలీ టెలిగ్రాఫ్ పత్రికలో  "Pakistan Air Force is the undisputed king of the skies" అనే హెడ్లైన్‌తో కథనాన్ని ప్రచురించిందని దార్ తన సెనెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్ మీడియా పరిశీలనలో అది పూర్తిగా నకిలీగా తేలింది. ఈ వార్తా కథనం ఆపరేషన్ సిందూర్ తర్వాత పెరిగిన ఉద్రిక్తతల వేళ సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించిందన్నారు. డౌన్ న్యూస్ బృందం అసలు డైలీ టెలిగ్రాఫ్ ను పరిశీలించగా అలాంటి కథనం ఎప్పుడూ ప్రచురిత కాలేదని నిర్ధారించగలిగింది.

ఫ్యాక్ట్ చెక్ సమయంలో డౌన్ న్యూస్ బృందం పలు స్పెల్లింగ్ మిస్టేక్స్ ను కూడా గుర్తించింది . Force  బదులు  Fyaw ,  performance బదులు  preformance ,  Air Force  బదులు  Aur Force మరియు   advancement బదులు advancemend  వంటి పదాలు వాడటం ద్వారా ఈ కథనాన్ని నకిలీగా గుర్తించారు. ఇలా ప్రతిష్ఠాత్మక బ్రిటిష్ పత్రికలో అతిసాధారణమైన భాషాపరమైన లోపాలుండవని డౌన్ న్యూస్ స్పష్టం చేసింది.

అలాగే నకిలీ కథనంలో ఉన్న పేజీ లేఅవుట్ కూడా అసలు డైలీ టెలిగ్రాఫ్ ప్రచురణలతో సరిపోలేదని పాక్ మీడియా స్పష్టం చేసింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫేక్ వార్తాగా డౌన్ న్యూస్ క్లారిటీ ఇచ్చింది, 

ఈ పరిణామంతో పాక్ సర్కారు యొక్క సమాచార సేకరణ పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  స్వయంగా దేశ ఉప ప్రధాని నకిలీ డైలీ టెలిగ్రాఫ్ వార్తను ప్రస్తావించడంతో పాక్ ప్రజల నుండే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు పాక్ జర్నలిస్టులు మరియు సోషల్ మీడియా వినియోగదారులు ఈ నకిలీ వార్తను బయటపెట్టారు.

పాకిస్థాన్ మీడియానే వేలెత్తి చూపుతోంది

ది నేషన్ జర్నలిస్టు ఇమ్రాన్ ముక్తార్ ఎక్స్ లో..."నకిలీ వార్తలు నిజాన్ని మసకబారుస్తున్నాయి. దేశ ఉపప్రధాని మరియు విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్ ఈ నకిలీ వార్తను సెనెట్‌లో ఉటంకించారు. నిస్సందేహంగా పాక్ ఎయిర్ ఫోర్స్ మెరుగ్గా పనిచేసింది – కానీ ఈ చిత్రం నకిలీది." అని పేర్కొన్నాడు. 

పాక్ ప్రభుత్వ ప్రతినిధి అయిన దార్ ఇలాంటి నకిలీ సమాచారం ఆధారంగా అధికారిక వేదికపై ప్రకటన చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Dawn News ఇప్పటికే ఈ డైలీ టెలిగ్రాఫ్ కథనం నకిలీదని నిర్ధారించిన నేపథ్యంలో, పాక్ రాజకీయ రంగంలో ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారితీస్తోంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే