జైషే, ఐఎస్ఐ లింక్:పాకిస్తాన్ గుట్టు విప్పిన ముషర్రఫ్

By narsimha lodeFirst Published Mar 7, 2019, 1:18 PM IST
Highlights

భారత్‌పై దాడులు చేసేందుకు ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ను పాక్ ఇంటలిజెన్స్‌ సర్వీసెస్‌ను వినియోగించుకొంటుందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ తేల్చి చెప్పారు.


ఇస్లామాబాద్: భారత్‌పై దాడులు చేసేందుకు ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ను పాక్ ఇంటలిజెన్స్‌ సర్వీసెస్‌ను వినియోగించుకొంటుందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ తేల్చి చెప్పారు.

పాకిస్తాన్ జర్నలిస్ట్ నదిమ్ మాలిక్‌కు ఇచ్చిన  టెలిఫోన్  ఇంటర్వ్యూలో  ఆయన ఈ విషయాన్ని  బట్టబయలు చేశారు.జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ అయినప్పటికీ తన పాలన కాలంలో  భారత్‌పై దాడుల కోసం ఉపయోగించుకొన్నట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. 

తాను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో  తనను హత్య చేసేందుకు ఈ సంస్థ రెండు దఫాలు ప్రయత్నించినట్టుగా ఆయన ఆరోఫణలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో భారత్, పాక్‌లు రహస్యంగానే పోరాటం చేసేవన్నారు. పూల్వామా ఉగ్రదాడితో పాటు భారత్‌లో జరిగిన ఉగ్ర దాడిలో జైషే చీఫ్ మసూద్ హస్తం ఉందని భారత్ పాక్‌కు సాక్ష్యాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
 

click me!