జైషే మహ్మద్ క్యాంపస్ కి మసూద్ అజర్ తరలింపు

Published : Mar 04, 2019, 02:43 PM ISTUpdated : Mar 04, 2019, 03:06 PM IST
జైషే మహ్మద్ క్యాంపస్ కి మసూద్ అజర్ తరలింపు

సారాంశం

ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ని తాజాగా జైషే మహ్మద్ క్యాంపస్ కి తరలించారు. 

ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ని తాజాగా జైషే మహ్మద్ క్యాంపస్ కి తరలించారు. ఇటీవల మసూద్ అజర్ మరణించాడనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. అవన్నీ వదంతులనేనని పాక్ మీడియాకొట్టి పారేసింది. 

అయితే.. ఆర్మీ ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్న మసూద్ ని భావల్పూర్ లోని జైషే మహ్మద్ క్యాంపస్ కి తరలించారు. మసూద్‌ అజర్‌ చనిపోయాడనే వదంతుల నేపథ్యంలో ఆయన తరలింపుపై సమాచారం గందరగోళానికి తావిస్తోంది. 

జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌ భారత వైమానిక దళం చేపట్టిన మెరుపు దాడుల్లో తీవ్రంగా గాయపడి మరణించాడని, కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతూ ఆయన మరణించాడంటూ విభిన్న కథనాలు వెల్లడైన నేపథ్యంలో మసూద్‌ సజీవంగా ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారని ఓ వార్త పత్రిక కథనం వెలువరించింది. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !