పాక్ మరో నాటకం.. ఇండియన్ సబ్ మెరైన్ అడ్డుకున్నామంటూ..

Published : Mar 05, 2019, 03:12 PM IST
పాక్ మరో నాటకం.. ఇండియన్ సబ్ మెరైన్ అడ్డుకున్నామంటూ..

సారాంశం

పాకిస్థాన్ మరో నాటకానికి తెర లేపింది. భారత్ కి చెందిన ఓ సబ్ మెరైన్ తమ జలాల్లోకి ప్రవేశిచిందని.. దానిని తాము అడ్డుకున్నామంటూ ప్రకటించింది. 

పాకిస్థాన్ మరో నాటకానికి తెర లేపింది. భారత్ కి చెందిన ఓ సబ్ మెరైన్ తమ జలాల్లోకి ప్రవేశిచిందని.. దానిని తాము అడ్డుకున్నామంటూ ప్రకటించింది. తమ దగ్గర ఉన్న ప్రత్యేక నైపుణ్యాలను ఉపయోగించి సబ్ మెరైన్ ను అడ్డుకున్నామని పాక్ నేవీ అధికారి ప్రతినిధి ప్రకటించారు. అంతేకాదు.. ఇదిగో ప్రూఫ్ అంటూ ఓ వీడియోని కూడా విడుదల చేశారు.

ఆ వీడియో పై నుంచి తీసినట్టు ఉండగా.. అందులో ఒక సబ్ మెరైన్ నీటిపై వెళుతూ కనిపిస్తోంది. అయితే.. ఈ వీడియో నిజమా, కాదా నే విషయాన్ని నిర్దారించే పనిలో పడ్డారు భారత రక్షణ వర్గాలు. అసలు ఈ వీడియో.. 2016 సంవత్సరం నాటిదని కొందరు అధికారులు తమ  అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పుడో జరిగిన దానిని ఇప్పుడు విడుదల చేయడంపై అనుమానాలు దారితీస్తోంది. పాక్ మరో నాటకం మొదలుపెట్టిందని వారు భావిస్తున్నారు. ఇటీవల పుల్వామా పై ఉగ్రవాదులు దాడికి పాల్పడగా.. 43మంది జవానులు అమరులైన సంగతి తెలిసిందే. దీనికి భారత్ ప్రతీకారం కూడా తీర్చుకుంది. 

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ