Latest Videos

"పెషావర్ కంటే ఢిల్లీనే ఎక్కువగా ఇష్టపడుతా.. ": పాక్ మాజీ FBR ఛైర్మన్ 

By Rajesh KarampooriFirst Published Jun 3, 2024, 5:19 PM IST
Highlights

Pakistan ex FBR chairman Shabbar Zaidi: భారత్ - పాక్ విభజనపై పాకిస్తాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (FBR) మాజీ ఛైర్మన్ సయ్యద్ మొహమ్మద్ షబ్బర్ జైదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పెషావర్ కంటే ఢిల్లీనే ఉండటానికి ఇష్టపడుతానని అన్నారు. 

Pakistan ex FBR chairman Shabbar Zaidi: భారత్ - పాక్ విభజనపై పాకిస్తాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (FBR) మాజీ ఛైర్మన్ సయ్యద్ మొహమ్మద్ షబ్బర్ జైదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 1947లో విభజన సమయంలో తన తల్లితండ్రుల పాకిస్థాన్ లో ఉండటం కంటే.. భారత్ లో నివసించాలని భావిస్తే.. తాము, తన కుటుంబం మరింత సంతోషంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. భారత్ పాక్ విభజనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

రాఫ్తార్ అనే యూట్యూబ్ ఛానెల్‌ కు FBR మాజీ ఛైర్మన్ సయ్యద్ మొహమ్మద్ షబ్బర్ జైదీ ఇంటర్వ్యూ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. "మా తాతగారు ప్రభుత్వోద్యోగి. విభజన సమయంలో పొరపాటున పాకిస్థాన్‌ను ఎంచుకున్నారు. ఆయన తప్పు చేశారు. అందుకు చింతిస్తున్నాను.  పశ్చాత్తాపపడుతున్నాను. మా తాత తప్పు చేసాడు. ఈ నిర్ణయంపై  నేను అతనితో చాలా వాదించాను. 1947లో డిల్లీలోనే ఉంటే.. తాము భారతదేశంలో నివసించే వారిమి. కానీ అతను పాకిస్తాన్‌ను ఎందుకు ఎంచుకున్నాడో తెలియదు. " అని పాకిస్తాన్ FBR మాజీ ఛైర్మన్ చెప్పారు.
 
"పెషావర్ కంటే ఢిల్లీలోనే బెటర్ ’’

భారతదేశం, పాకిస్తాన్ లోని జీవనం గురించి ప్రశ్నించగా..  జైదీ నిస్సందేహంగా భారత్ వైపు మొగ్గు చూపారు. పెషావర్, లాహోర్ లేదా కరాచీతో పోలిస్తే.. ఢిల్లీలో తాను సౌకర్యవంతంగా ఉంటాననీ గుర్తుచేసుకున్నారు. జాతీయ సరిహద్దులను దాటిన సాంస్కృతిక, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తాను వ్యక్తిగతంగా  పెషావర్‌లో కంటే ఢిల్లీలో చాలా సౌకర్యంగా ఉంటాననీ, తాను గత 20 సంవత్సరాలుగా లాహోర్‌లో నివసించాననీ, నేటీకి కూడా పెషావర్ లేదా లాహోర్ కంటే ఢిల్లీలో ఎక్కువ సౌకర్యంగా ఉంటానని అన్నారు. నేటీకి కూడా  ఇఫ్తారీ సందర్భంగా ముంబైలోని మహ్మద్ అలీ స్ట్రీట్, క్రాఫోర్డ్ మార్కెట్‌కి వెళ్తే.. మక్కా మదీనాలో కూర్చున్న అనుభూతి కలుగుతుందని అన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి ఇంకా మెరుగైందని అన్నారు.

"భారత్‌-పాకిస్థాన్‌లను పోల్చడం ఏనుగును చీమతో పోల్చినట్లే"

భారత్ - పాకిస్తాన్ మధ్య ప్రతి విషయంలో వైరుధ్యం ఉందనీ, ఇరు దేశాలను పోల్చలేమని అన్నారు. భారత్‌-పాకిస్థాన్‌లను పోల్చడమంటే.. ఏనుగును చీమతో పోల్చినట్లే అని అభిప్రాయం పడ్డారు. అమెరికా భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడదు. కానీ వారు భారతదేశంతో చాలా వాణిజ్య ప్రయోజనాలను పొందుతున్నారు. అనేక అమెరికన్ కంపెనీలలో IT మౌలిక సదుపాయాలు భారత్ అందిస్తుంది. అమెరికా 1.4 బిలియన్ల ఆర్థిక వ్యవస్థలో భారత్‌ పాత్ర కూడా ఉంది”అని పాకిస్తాన్ మాజీ ఛైర్మన్ వ్యాఖ్యానించారు.

 
"కాశ్మీర్ పాకిస్థాన్ చేతుల్లోంచి జారిపోయిందా?"

ఈ విషయంపై జైదీ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో అశాంతి గురించి కూడా విస్మయం వ్యక్తం చేశారు. విదేశీ జోక్యం, ఈ ప్రాంతంపై పాకిస్తాన్ నియంత్రణకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. "నిజంగా చెప్పాలంటే.. నాకు PoK అశాంతి అర్థం కాలేదు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి. మనపై కుట్ర పని చేసి ఉండవచ్చునని నేను భావిస్తున్నాను. అయినప్పటికీ.. నేను కుట్ర సిద్ధాంతాలను నమ్మను. కానీ కాశ్మీర్ కథ మన చేతుల్లోంచి జారిపోయిందని ప్రజలు ఎందుకు ఆందోళన చెందడం లేదు." అని వ్యాఖ్యానించాడు.

జైదీ ఇంకా మాట్లాడుతూ.. "ఇది చాలా ప్రమాదకరమైన విషయం. కాశ్మీర్ అశాంతితో పాకిస్తాన్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. హింస, నిరసనలతో పాకిస్తాన్‌లో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం.. వాస్తవానికి ఈ విషయాన్ని ఆలోచించేలా చేసింది?  ఏమి జరిగింది? ఇది సరైనది? ఆలోచించాల్సిన విషయం? వేలాది మంది వచ్చారు. నిరసన తెలిపేందుకు రోడ్డుపై... రేపు భారత్ వైపు వెళితే పాకిస్థాన్ ప్రభుత్వం ఏం చేస్తుంది? పాక్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన రోజున మనం కాశ్మీరీలను అపహాస్యం చేశామని మీరు గమనించారా? అని అన్నారు. జాతీయ గుర్తింపు, భౌగోళిక రాజకీయ వాస్తవాల సంక్లిష్టతలకు వ్యతిరేకంగా మరింత సంపన్నమైన, స్థిరమైన భవిష్యత్తు కోసం ఆరాటమని అన్నారు.  

షబ్బర్ జైదీ ఎవరు?

సయ్యద్ మొహమ్మద్ షబ్బర్ జైదీ ..  పాకిస్థానీ చార్టర్డ్ అకౌంటెంట్, ఆయన  మే 2019 నుండి ఏప్రిల్ 2020 వరకు పాకిస్తాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూకి 26వ ఛైర్మన్‌గా పనిచేశారు. అంతకుముందు ఆయన 2013 కేర్‌టేకర్ సెటప్ సమయంలో సింధ్ ప్రభుత్వంలో ప్రాంతీయ మంత్రిగా పనిచేశాడు. అలాగే ఆయన  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ పాకిస్థాన్‌లో సహ సభ్యుడుగా , 2005-2006 వరకు ఇన్‌స్టిట్యూట్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.

అంతేకాకుండా..  1969 నుండి ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ ఇంటర్నేషనల్‌లో సభ్యుడు,  A.F. ఫెర్గూసన్ & కంపెనీతో పని చేస్తూ ప్రస్తుతం సీనియర్ భాగస్వామిగా పని చేస్తున్నారు. షబ్బర్ జైదీ రచయిత కూడా..  సయ్యద్ షబ్బర్ జైదీ పనామా లీక్స్ - ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైస్ - ఆఫ్‌షోర్ అసెట్స్ ఆఫ్ పాకిస్తానీ సిటిజన్స్, ఎ జర్నీ ఫర్ క్లారిటీ అండ్ పాకిస్థాన్: నాట్ ఎ ఫెయిల్డ్ స్టేట్‌తో సహా అనేక పుస్తకాలు రాశారు.

click me!