మాకేం లింక్: పుల్వామా దాడిపై పాక్ బుకాయింపు

By telugu teamFirst Published Feb 15, 2019, 11:12 AM IST
Highlights

ప్రపంచంలో ఎక్కడ హింసాత్మక సంఘటనలు జరిగినా తాము ఖండిస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తు జరపకుండా దాడితో పాకిస్తాన్ కు సంబంధం ఉందని భారత ప్రభుత్వం, మీడియా మాట్లాడడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. 

ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీరులోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. ఈ దాడితో తమకు ఏ విధమైన సంబంధం లేదని బుకాయించింది. పుల్వామా జిల్లాలో సిఆర్ప్ఎఫ్ కాన్వాయ్ పై కారు బాంబు ఆత్మాహుతి దాడిలో 44 మంది మరణించిన విషయం తెలిసిందే. 

ఆ మేరకు పాకిస్తాన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచంలో ఎక్కడ హింసాత్మక సంఘటనలు జరిగినా తాము ఖండిస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తు జరపకుండా దాడితో పాకిస్తాన్ కు సంబంధం ఉందని భారత ప్రభుత్వం, మీడియా మాట్లాడడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. 

పాకిస్తాన్ ఉగ్రవాదులకు ప్రోత్సాహం ఇవ్వడాన్ని నిలిపేయాలని భారత్ హెచ్చరించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ తన దేశంలోంచి పనిచేసే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలని కూడా డిమాండ్ చేసింది. 

పుల్వామాలో దాడికి పాల్పడిన జైష్ - ఎ - మొహమ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజర్ తో పాటు ఉగ్రవాదులను ఐక్య రాజ్యసమితి ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని డిమాండ్ ను సమర్థించాలని భారత్ ప్రపంచదేశాలను కోరింది. 

సంబంధిత వార్తలు

42 మందిని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్ట్: ఎవరీ ఆదిల్?

"నేను స్వర్గంలో ఉంటా": జవాన్లపై దాడి చేసిన ఉగ్రవాది చివరి మాటలు

జమ్మూ కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడి... 350 కిలోల పేలుడు పదార్థాలతో

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి తెగబడిన ముష్కరులు..20మంది ఆర్మీ జవాన్ల మృతి

click me!