ఇండియా యుద్ధ విమానాలను కూల్చిన పాక్ పైలట్లు వీరే

By narsimha lodeFirst Published Mar 7, 2019, 3:00 PM IST
Highlights

 ఇండియాకు చెందిన మిగ్-21  యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఇద్దరు పైలట్ల వివరాలను  ఆ దేశం ప్రకటించింది. పాక్ యుద్ధ విమానాన్ని వెంటాడుతూ వెళ్లిన మిగ్-21 యుద్ధ విమానం కుప్పకూలింది. 
 


ఇస్లామాబాద్: ఇండియాకు చెందిన మిగ్-21  యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఇద్దరు పైలట్ల వివరాలను  ఆ దేశం ప్రకటించింది. పాక్ యుద్ధ విమానాన్ని వెంటాడుతూ వెళ్లిన మిగ్-21 యుద్ధ విమానం కుప్పకూలింది. 

ఈ యుద్ధ విమానంలో అభినందన్  ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకొన్న విషయం తెలిసిందే. ఇండియాకు చెందిన యుద్ధ విమానాలను కూల్చిన పైలట్ల వివరాలను  పాక్ బయటపెట్టింది.

పాకిస్తాన్ పార్లమెంట్‌లో ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ ఖురేషీ ప్రకటించారు.పాక్ వైమానిక దళం రెండు భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్టుగా ప్రకటించింది. 

ఒక భారత యుద్ధ విమానాన్ని కూల్చిన వ్యక్తి స్వ్కాడ్రన్‌ లీడర్‌ హసన్‌ సిద్దిఖీ.  అయితే ఈ దాడిలో పాక్ పైలట్ హసన్ సిద్ధీఖీ మృతి చెందాడని ఖురేషీ ప్రకటించారు. ఖురేషీ మృతి పట్ల పాక్ పార్లమెంట్  నివాళులు అర్పించింది. మరో వైపు నౌమాన్ అలీ ఖాన్ అనే పైలట్ కూడ ఇండియాకు చెందిన యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టుగా ఆయన  గుర్తు చేశారు. 

ఈ ఏడాది ఫిబ్రవరి 14 వ తేదీన పూల్వామాలో సీఆర్‌ఫీఎఫ్ వాహనాల కాన్వాయ్‌పై జైషే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.  ఈ దాడిలో 44 మంది జవాన్లు మృతి చెందారు.  ఈ దాడికి కౌంటర్‌గా బాలాకోట్‌లోని జైషే ఉగ్రవాద శిబిరంపై ఇండియా సర్జికల్ స్ట్రైక్స్‌కు పాల్పడ్డారు. ఇండియా సర్జికల్ స్ట్రైక్స్‌కు  కౌంటర్‌గా పాక్ యుధ్దవిమానాలు భారత్‌ గగనతలంలోకి రావడంతో ఆ విమానాన్ని భారత విమానాలు వెంటాడాయి. 

click me!