
Pakistan Army : పెహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్ హస్తం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో పాకిస్థాన్ పై ఇప్పటికే ఆంక్షలు విధించిన భారత్ మరిన్ని చర్యలకు సిద్దమవుతోంది. దీంతో ఏ సమయంలో భారత్ ఏం చేస్తుందోనని పాక్ వణికిపోతోంది. అక్కడి అధికార యంత్రాంగమే కాదు ఆర్మీ అధికారులు కూడా ఇండియా పేరువింటేనే బెంబేలెత్తిపోతున్నారు. పాక్ ఆర్మీ అధికారులు, సామాన్య సైనికులు రాజీనామాలే వారు ఎంతలా భయపడుతున్నారో తెలియజేస్తోంది.
ఇటీవల హిందువులపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ కూడా కనిపించకుండా పోయాడనే ప్రచారం జరుగుతోంది. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో తమ కుటుంబాలను పాక్ ఆర్మీ అధికారులు దేశం దాటిస్తున్నారట. మునీర్ కూడా అదే చేసాడని జోరుగా ప్రచారం సాగుతోంది... కానీ ఈ ప్రచారానికి పాక్ పిఎంవో తెరదించింది. తాజాగా మునీర్ ప్రధానితో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసింది.
భారత్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది. దీంతో పాకిస్తాన్ సైన్యంలోని దాదాపు 5,000 మంది సైనికులు, అధికారులు రాజీనామా చేసినట్లు సమాచారం. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
సైన్యాధిపతి పరార్, సైనికులు రాజీనామా
పెహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే దశలవారీగా చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్‌ను అన్ని వైపుల నుంచి ఒంటరి చేస్తోంది. జల ఒప్పందం రద్దు, వాఘా సరిహద్దు మూసివేత, పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్ళమని చెప్పడం వంటి చర్యలతో పాటు అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
పాకిస్తాన్ అణ్వాయుధాలను ప్రయోగిస్తామని బెదిరిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ తన కుటుంబాన్ని లండన్‌కు తరలించారు. ఆయన కూడా కనిపించకుండా పోయారని పాకిస్తాన్‌లోనే చర్చ జరుగుతోంది. యుద్ధ సమయంలో ముందుండి నడిపించాల్సిన సైన్యాధిపతి తన కుటుంబం, తన భద్రత గురించి ఆలోచించడం పాక్ సైన్యంలోని సైనికులు, అధికారులను భయభ్రాంతులకు గురిచేసింది. భారత్ ప్రతీకారం భయంతో గత రెండు రోజుల్లో దాదాపు 5,000 మంది సైనికులు, అధికారులు రాజీనామా చేశారు.
కమాండర్ లేఖతో పెరిగిన ఆందోళన
పాకిస్తాన్ మిలిటరీ 11వ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారీ, పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్‌కు లేఖ రాశారు. పాకిస్తాన్ సైన్యం ఆత్మస్థైర్యం కోల్పోయింది. ప్రతిరోజూ రాజీనామా చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ రాజీనామాలు ఇలాగే కొనసాగితే భారత సైన్యానికి సమాధానం చెప్పలేమని ఆయన హెచ్చరించారు.
పాకిస్తాన్ గణాంకాల ప్రకారం పాక్ మిలిటరీ 12వ కార్ప్స్ బెటాలియన్‌లో 200 మంది అధికారులు, 600 మంది సైనికులు రాజీనామా చేశారు. నార్తర్న్ కమాండ్ ఏరియా బెటాలియన్‌లో 100 మంది అధికారులు, 500 మంది సైనికులు రాజీనామా చేశారు. భారత సరిహద్దుల్లో మోహరించిన మంగల్ కార్ప్స్ బెటాలియన్‌లో 75 మంది అధికారులు, 500 మంది సైనికులు రాజీనామా చేశారు.
పాకిస్తాన్ సైన్యాధిపతి చర్యలు పాక్ సైనికులను ఆందోళనకు గురిచేశాయి. పాక్ సైన్యాధిపతి ప్రాణభయంతో పారిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో పాక్ సైనికులు భయపడి ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేస్తున్నారు. భారత్ ఎలా దాడి చేస్తుందో పాకిస్తాన్‌కు తెలియడం లేదు. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్‌లతో భారత్ గతంలో హెచ్చరికలు జారీ చేసింది. ఈసారి మరింత కఠినంగా దాడి చేస్తుందనే భయం పాక్ సైన్యంలో నెలకొంది.