కూతురి ప్రేమ వివాహం.. తండ్రి పగ: 8 మంది సజీవదహనం, మృతుల్లో నలుగురు చిన్నారులు

Siva Kodati |  
Published : Oct 19, 2021, 03:50 PM IST
కూతురి ప్రేమ వివాహం.. తండ్రి పగ: 8 మంది సజీవదహనం, మృతుల్లో నలుగురు చిన్నారులు

సారాంశం

ప్రపంచం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నా పాకిస్తాన్‌లో (pakistan) ఇంకా అనాగరిక చర్యలు కొనసాగుతూనే వున్నాయి. ముఖ్యంగా ఆ దేశంలో పరువు హత్యల వ్యవహారం తారాస్థాయికి చేరింది. అంతేకాదు.. తమ మాటలను కాదంటే కన్నబిడ్డలనైనా సరే కడతేరుస్తున్నారు తల్లిదండ్రులు.

ప్రపంచం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నా పాకిస్తాన్‌లో (pakistan) ఇంకా అనాగరిక చర్యలు కొనసాగుతూనే వున్నాయి. ముఖ్యంగా ఆ దేశంలో పరువు హత్యల వ్యవహారం తారాస్థాయికి చేరింది. అంతేకాదు.. తమ మాటలను కాదంటే కన్నబిడ్డలనైనా సరే కడతేరుస్తున్నారు తల్లిదండ్రులు. తాజాగా తాను చూపించిన యువకుడిని కూతురు పెళ్లి చేసుకోలేదన్న కోపంతో.. ఇంట్లోని ఎనిమిది మందిని సజీవదహనం చేశాడో కసాయి తండ్రి. 

వివరాల్లోకి వెళితే.. ముజఫర్‌గఢ్ (muzaffargad) జిల్లాకు చెందిన మంజూర్ హుస్సేన్‌కు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడున్నారు. 2020లో చిన్న కూతురైన ఫౌజియా బీబీ.. మహబూబ్ అహ్మద్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఓ అబ్బాయి పుట్టాడు. ఆ పెళ్లి ఇష్టం లేని మంజూర్.. ఎప్పుడూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే ముజఫర్‌గఢ్‌లోనే ఉంటున్న తన ఇద్దరు కూతుళ్ల ఇళ్లకు తన కొడుకు సాబిర్ హుస్సేన్ తో కలిసి నిప్పు పెట్టాడు.

ALso Read:వేరే కులపు యువకుడితో లేచిపోయిందని.. కుటుంబీకుల దారుణం

ఆ మంటల్లో బీబీ, ఆమె నెలల కుమారుడు, పెద్ద కూతురు ఖుర్షీద్ మాయి, ఆమె భర్త, నలుగురు చిన్నారులు కాలిబూడిదయ్యారు. అయితే పని నిమిత్తం బయటికి వెళ్లిన బీబీ భర్త మహబూబ్ అహ్మద్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన రోజే అతడు తిరిగొచ్చాడు. అప్పటికే రెండు ఇళ్లూ మంట్లలో కాలిపోతుండడాన్ని గమనించిన అతడు స్థానికులతో కలిసి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.

ఈ ఘటనపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో మంజూర్, సాబిర్ లను తాను అక్కడే చూశానని, వారిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు  నమోదు చేసుకున్న పోలీసులు.. పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా, పాక్‌లో ఏటా వెయ్యికిపైగా పరువు హత్యలు (honor killing) జరుగుతున్నట్టు పలు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?