మృత సముద్రం పక్కన నగ్నంగా 200 మంది మోడల్స్.. తెల్లరంగు పూసుకుని ఫొటోలకు పోజు

By telugu teamFirst Published Oct 18, 2021, 1:29 PM IST
Highlights

ఇజ్రాయెల్‌లోని డెడ్ సీ పక్కన 200 మంది పురుష, మహిళ మాడల్స్ నగ్నంగా ఫొటోకు పోజులిచ్చారు. కనుమరుగవుతున్న డెడ్ సీ పై అవగాహన కల్పించడానికి అమెరికన్ ఆర్టిస్ట్ స్పెన్సర్ టూనిక్ ఇక్కడ ఫొటో షూట్ నిర్వహించారు. ఇందులో భాగంగా తెలుపురంగు ఒంటికి పూసుకుని 200 మంది మాడల్స్ నగ్నంగా పది వరుసల్లో నిలబడ్డారు.

న్యూఢిల్లీ: అది ఇజ్రాయెల్ దేశం. దక్షిణ Israelలో Dead Sea పక్కన 200 మంది మాడల్స్ నగ్నంగా గుమిగూడారు. ఒంటిపై తెలుపురంగు పూసుకుని ఆ మృతసముద్రం పక్కన రాళ్ల భూమిలో ఎండలో నిలుచుని ఉన్నారు. చేతులు కిందకు పెట్టి అటెన్షన్ మోడ్‌లో పది వరసల్లో నిలుచుని ఫొటోలకు పోజులిచ్చారు. అమెరికన్ ఆర్టిస్ట్ స్పెన్సర్ టూనిక్ ఓ మెగా ఫోన్ పట్టుకుని నిచ్చెన ఎక్కి వారి ఫొటోలు తీస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు ప్రపంచమంతా చర్చనీయాంశమైంది. ఆ కార్యక్రమ నిర్వాహకుల ఉద్దేశ్యమూ అదే. 

ఇజ్రాయెల్ చరిత్రలో మృత సముద్రానికి ముఖ్యపాత్ర ఉన్నది. ఈ డెడ్ సీ ఒక ఉప్పు సరస్సు. కొంతకాలంగా ఈ సరస్సు క్రమంగా కనుమరుగవుతున్నది. ఏడాదికి మీటర్ చొప్పున కుచించుకుపోతున్నది. ఇక్కడికి వచ్చే నీటిని సాగుకు అధికంగా మళ్లించడం, సరస్సులో ఖనిజ సంపద, పర్యావరణ మార్పులతో ఇంకిపోతున్నది.

Also Read: రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి

దీని దుస్థితిపైనా అవగాహన తేవాలని యోచిస్తున్నది. అందుకే అమెరికన్ ఆర్టిస్ట్ స్పెన్సర్ టూనిక్‌తో ఇక్కడ ఫొటో షూట్ నిర్వహించి ప్రపంచదృష్టిని ఇక్కడకు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. దశాబ్దకాలం క్రితమే టూనిక్ ఇక్కడ ఓ ఫొటో షూట్ నిర్వహించారు. అప్పుడు వేయి మంది nude మాడల్స్‌తో షూట్ చేశారు. తాజాగా మూడో సారి అదే బాటలో షూట్ చేశారు. డెడ్ సీ బ్యాక్‌గ్రౌండ్‌లో నగ్న మాడళ్లతో స్టిల్స్ తీశారు. లాట్స్ వైఫ్ అనే కథ ప్రేరణగా మాడల్స్‌కు తెల్లరంగు పూయించినట్టు టూనిక్ వివరించారు. ఆమె ఉప్పుకు పిల్లర్‌గా నిలిచారని పేర్కొన్నారు. పర్యావరణ మార్పులను ఎత్తిచూపడంతోపాటు డెడ్ సీ చరిత్రను భద్రపరిచే ఉద్దేశంతో నిర్మించ తలపెట్టిన మ్యూజియంపైనా ప్రపంచాన్ని ఆకర్షించడానికి ఇజ్రాయెల్ ఈ ప్రోగ్రామ్ చేపట్టినట్టు అధికారులు చెప్పారు. తద్వార టూరిజం పెంచుకోవాలని యోచించినట్టు తెలుస్తున్నది.

click me!