రిమాండ్ లో ఉన్న మహిళతో జైలులో నగ్నంగా డ్యాన్స్... లేడీ ఇన్ స్పెక్టర్ డిస్మిస్...

By AN TeluguFirst Published Nov 15, 2021, 9:42 AM IST
Highlights

రిమాండ్లో ఉన్న మహిళా దుస్తులు విప్పించి అందరిముందు dance చేయించిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో స్పందించిన ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

కరాచీ :  పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో దారుణం జరిగింది. పోలీస్ రిమాండ్లో ఉన్న మహిళపై లేడీ ఇన్స్ పెక్టర్ అత్యంత అమానవీయంగా ప్రవర్తించింది. ఆమె దుస్తులు విప్పించి జైలులోని ఇతరుల ముందు డ్యాన్స్ చేయించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు సదరు లేడీ ఇన్‌స్పెక్టర్ షబానా ఇర్షాద్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. బాధిత మహిళను  జైలు కస్టడీకి తరలించారు.

రిమాండ్లో ఉన్న మహిళా దుస్తులు విప్పించి అందరిముందు dance చేయించిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో స్పందించిన ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ సందర్భంగా 
Lady Inspector తన విధులను దుర్వినియోగం చేసినట్లు తెలిసింది.  జైలులో రిమాండ్లో ఉన్న మహిళపై అమానవీయంగా ప్రవర్తించినట్లు వెల్లడయింది. క్వెట్టాలోని Jinnah Township లో చిన్నారి హత్య కేసుకు సంబంధించి పారీ గుల్ అనే మహిళను  shabana అరెస్టు చేసింది.

ఆమె పోలీస్ రిమాండ్ లో ఉండగా విచారణ పేరుతో దుస్తులు విప్పించిన ఇన్స్పెక్టర్..  జైలులోని అందరి ముందు నగ్నంగా డ్యాన్స్ చేయించినట్లు క్వెట్టా  igp మొహమ్మద్  అజర్ అక్రమ్ తెలిపారు.  మహిళా ఇన్స్పెక్టర్ షబానా చెప్పేందుకు ఏమీ లేదని,  ఆమెను విధుల నుంచి తప్పించి నట్లు చెప్పారు. సాటి మహిళపై ఇలా ప్రవర్తించడం సరికాదని  ఇది సహించరానిదనిపేర్కొన్నారు.

Libya: లిబియా అధ్యక్ష పదవికి గడాఫీ కుమారుడు పోటీ

ఇదిలా ఉండగా... దక్షిణ అమెరికా దేశం Ecuadorలోని అతిపెద్ద Prisonలో Gang Warలు జరుగుతున్నాయి. శనివారం తెల్లవారు జామున రెండు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణలు జరిగాయి. కత్తులు, పేలుడు పదార్థాలతో ఒక గ్యాంగ్‌పై మరో గ్యాంగ్ దాడులు చేసుకున్నాయి. పెవిలియన్ 2లో ఉన్న ఖైదీలను ఊపిరాడకుండా చేసి చంపడానికి మ్యాట్‌లను కాల్చారు. ఈ ఘటనలో కనీసం 68 మంది మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణలను అదుపులోకి తేవడానికి 900 మంది పోలీసు అధికారులు తీవ్రంగా శ్రమించారని అధికార పక్షం తెలిపింది. అంతర్జాతీయ Drugs అక్రమ రవాణాపై ఆధిపత్యం కోసమే ఈ గ్యాంగ్ వార్ జరిగినట్టు కొన్నివర్గాలు తెలిపాయి. ఎదుటి గ్యాంగ్‌పై పై చేయి సాధించాలనే లక్ష్యంతోనే హింసాత్మక ఘర్షణలకు పాల్పడినట్టు తెలిసింది. సెప్టెంబర్‌లోనూ జైలులో గ్యాంగ్ వార్ జరిగిన 119 మంది ఖైదీలు దుర్మరణం చెందారు.

ఈక్వెడార్‌ తీర నగరం గయాక్విల్‌లోని దేశంలోనే అతిపెద్ద కారాగారం లిటోరల్ పెనిటెన్షియరీలో ఈ దారుణం జరిగింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల మధ్య ఘర్షణ జరిగిందని దేశ అధికారులు కొందరు చెప్పారు. ఉదయం ప్రారంభమైన ఈ దాడులు కనీసం 8 గంటల పాటు జరిగినట్టు తెలిపారు.

ఘర్షణల ప్రారంభంలో డైనమైట్ ద్వారా గోడను కూల్చి పెవిలియన్ 2లోని ఖైదీలందరినీ ఊచకోత కోయాలనే ప్రయత్నాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. పొగతో ఊపిరి ఆడనివ్వకుండా చంపేయాలనే ప్లాన్ కూడా అమలు చేసినట్టు గయాస్ ప్రావిన్స్ గవర్నర్ పాబ్లో అరొసెమెనా వివరించారు. తాము డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని, ఇది చాలా కష్టమైన పోరాటామని తెలిపారు.
 

click me!