కరోనాను నిరోధించే ప్రక్రియలో ఆక్స్ ఫర్డ్ యూనిర్శిటీ తయారు చేస్తోన్న అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మంచి ఫలితాలు ఇస్తోందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రకటించింది. ఈ మేరకు క్లినికల్ ట్రయల్స్ డేటాను ఆ సంస్థ సోమవారం నాడు విడుదల చేసింది.
న్యూయార్క్:కరోనాను నిరోధించే ప్రక్రియలో ఆక్స్ ఫర్డ్ యూనిర్శిటీ తయారు చేస్తోన్న అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మంచి ఫలితాలు ఇస్తోందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రకటించింది. ఈ మేరకు క్లినికల్ ట్రయల్స్ డేటాను ఆ సంస్థ సోమవారం నాడు విడుదల చేసింది.
కరోనా వ్యాక్సిన్ అధ్యయన ఫలితాలను ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ఫలితాలను ఆ సంస్థ ప్రకటించింది. మెడికల్ జర్నల్ ది లాన్సెట్ లో ఈ వ్యాక్సిన్ ఫేజ్-1 లో క్లినికల్ ట్రయల్స్ డేటాను తెలిపింది.
undefined
also read:గుడ్‌న్యూస్: మౌత్ స్ప్రేతో 20 నిమిషాల్లో కరోనా ఖతం
ఏప్రిల్ 23 నుండి మే 21 వరకు ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. వ్యాక్సిన్ ఇచ్చినవారిలో యాంటీబాడీస్, వైల్ సెల్స్ పెరిగినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సురక్షితమని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రకటించింది.ఈ వ్యాక్సిన్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతోందని ఆ సంస్థ తెలిపింది.
ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ సంస్థతో కలిసి ఇండియాలోని పుణెలోని సీరమ్ సంస్థ ఈ వ్యాక్సిన్ ను తయారు చేస్తోంది.