దేశం వీడేందుకు ప్రాణాలకు తెగిస్తున్న ఆఫ్ఘన్లు.. ఒక్క విమానంలో 640 మంది, అదీ కింద కూర్చొని

By Siva KodatiFirst Published Aug 17, 2021, 5:27 PM IST
Highlights

తాలిబన్ల అరాచక పాలనతో మళ్లీ చీకటి రోజులు రాబోతున్నాయన్న భయాందోళనలతో వేలాది మంది అఫ్గాన్‌ వాసులు నిన్న దేశం విడిచి వెళ్లేందుకు కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ విమానంలో దాదాపు 640 మంది అఫ్గాన్‌ వాసులు ఎక్కి కింద కూర్చున్నారు.

తాలిబన్ల రాకతో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు.. బతుకు జీవుడా అంటూ దేశం విడిచి పారిపోతున్నారు. ఇందుకోసం ప్రాణాలకు సైతం తెగిస్తున్నారు. నిన్న కాబూల్‌ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఘటనలే అందుకు నిదర్శనం. తాజాగా కాబూల్‌ విమానాశ్రయం నుంచి వచ్చిన అమెరికా విమానంలో కన్పించిన ఓ దృశ్యం.. అఫ్గాన్‌ పౌరుల దుస్థితికి అద్దం పడుతోంది. అందులో ఏకంగా 640 మంది కింద కూర్చుని ప్రయాణించారు.  

తాలిబన్ల అరాచక పాలనతో మళ్లీ చీకటి రోజులు రాబోతున్నాయన్న భయాందోళనలతో వేలాది మంది అఫ్గాన్‌ వాసులు నిన్న దేశం విడిచి వెళ్లేందుకు కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తారు. రద్దీ పెరగడంతో ఎయిర్‌పోర్టు గేట్లు మూసివేస్తే ప్రహరీ పైనుంచి దూకి, ఇనుప కంచెలను దాటుకొని లోపలికి ప్రవేశించారు. విమానాల్లో చోటు కోసం రన్‌వేపై పరుగులు తీశారు. లోపలికి ఎక్కేందుకు ఒకర్నొకరు తోసుకున్నారు. అలా అమెరికాకు చెందిన ఓ విమానంలో దాదాపు 640 మంది అఫ్గాన్‌ వాసులు ఎక్కి కింద కూర్చున్నారు. వారి వద్ద ఎలాంటి వస్తువులు కానీ, లగేజీ కానీ కన్పించలేదు. తాలిబన్ల నుంచి తప్పించుకునే క్రమంలో వారు కట్టుబట్టలతో ఇతర దేశాలకు పారిపోతున్నారు.  

Also Read:తాలిబన్లు వచ్చి చంపే క్షణాలు కోసం ఎదురుచూస్తున్నా.. అఫ్గాన్ తొలి మహిళా మేయర్ జరీఫా...

దీంతో ఈ విమానం రైల్లో జనరల్‌ బోగీని తలపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అమెరికా అధికారిక మీడియా సంస్థ ‘డిఫెన్స్‌ వన్‌’ తమ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విమానం ఖతార్‌లో ల్యాండ్ అయ్యిందని, అక్కడే వీరంతా దిగిపోయారని డిఫెన్స్ వన్‌ తెలిపింది.

click me!