పాకిస్తాన్‌లో మహారాజా రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసం: టీఎల్ఎఫ్ కార్యకర్త అరెస్ట్

By narsimha lodeFirst Published Aug 17, 2021, 5:04 PM IST
Highlights

పాకిస్తాన్ లోని లాహోర్ లో పాకిస్తాన్ లాహోర్ లో మహరాజా రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసమైంది.  టీఎల్పీ కార్యకర్తను  పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. పంజాబ్ ను 40 ఏళ్ల పాటు మహారాజా రంజిత్ సింగ్ పరిపాలించాడు

ఇస్లామాబాద్:పాకిస్తాన్ లోని లాహోర్ లో మహారాజా రంజిత్ సింగ్ విగ్రహన్ని టిఎల్పీకి  (పాకిస్తాన్ రాడికల్ గ్రూప్ సభ్యుడు) ధ్వంసం చేశారు. మంగళవారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది.  ఈ ఘటనకు పాల్పడ్డారనే నెపంతో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

2019 జూన్‌లో లాహోర్ పోర్ట్ కాంప్లెక్స్ లో తొమ్మిది అడుగుల విగ్రహన్ని ఆవిష్కరించారు. మహారాజా రంజిత్ సింగ్ 180వ వర్ధంతి సందర్భంగా కాంస్యంతో ఈ విగ్రహన్ని ఏర్పాటు చేశారు.

పిక్కు సామ్రాజ్యంలో మొట్టమొదటి మహారాజ రంజింత్ సింగ్. 1839 లో ఆయన మరణించారు. మరణానికి ముందు పంజాబ్ ని ఆయన 40 ఏళ్ల పాటు పాలించారు.ఈ ఘటనను పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి పవాద్ హుస్సేన్ తీవ్రంగా ఖండించారు.

2015 లో ఖాదీం హుస్సేన్ రిజ్వీ తెహ్రిక్-ఈ-లబైక్ ను ఏర్పాటు చేశారు. ఇది పాకిస్తాన్ లో ఓ ఇస్లామిక్ రాజకీయ పార్టీ. 2018 సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ ఐదవ అతి పెద్ద పార్టీ అవతరించింది. కానీ జాతీయ అసెంబ్లీలో ఏ ఒక్క సీటును ఆ పార్టీ దక్కించుకోలేకపోయింది.

ఈ ఏడాది ప్రారంభంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం టిఎల్‌పిని నిషేధించింది. టిఎల్‌పి కార్యకర్త రిజ్వాన్ ఈ విగ్రహన్నిధ్వంసం చేశారని పోలీసులు అరెస్ట్ చేశారు.ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక సహాయకుడు షాబాజ్ గిల్ రంజిత్ సింగ్ విగ్రహన్ని ధ్వంసం చేసిన నిందితులపై తక్షణ చర్యలు తీసుకొంటామన్నారు. ఇటీవలలోతత సమీయుల్లా సాహిబ్ విగ్రహం కూడా అపవిత్రం చేశారు. 

click me!