తాలిబన్లు వచ్చి చంపే క్షణాలు కోసం ఎదురుచూస్తున్నా.. అఫ్గాన్ తొలి మహిళా మేయర్ జరీఫా...

By AN TeluguFirst Published Aug 17, 2021, 4:03 PM IST
Highlights

ఆఫ్గాన్ లో అత్యంత చిన్న వయసులో మేయర్ అయిన జరీఫా కొన్ని వారాల క్రితం ఒక అంతర్జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సమయంలో భవిష్యత్తు బాగుండే అవకాశం ఉందంటూ ఆశాభావం వ్యక్తం చేసింది.  కానీ ఆమె కలలన్నీ ఆదివారంనాడు ముక్కలైపోయాయి.

‘నేను ఇక్కడ ఇలా కూర్చుని తాలిబన్ల కోసం ఎదురుచూస్తున్న నాకు, నా కుటుంబానికి సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు.  భర్త, పిల్లలతో కలిసి  కూర్చుని ఉన్నా.  నాలాంటి వారిని వెతుక్కుంటూ వచ్చే తాలిబన్లు మమ్మల్ని చంపేస్తారు’  ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా?...  ఆఫ్ఘనిస్తాన్లో తొలి మహిళా మేయర్గా ఎన్నికైన యువనేత జరీఫా ఘఫారీ.  

ఆఫ్గాన్ లో అత్యంత చిన్న వయసులో మేయర్ అయిన జరీఫా కొన్ని వారాల క్రితం ఒక అంతర్జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సమయంలో భవిష్యత్తు బాగుండే అవకాశం ఉందంటూ ఆశాభావం వ్యక్తం చేసింది.  కానీ ఆమె కలలన్నీ ఆదివారంనాడు ముక్కలైపోయాయి.

అఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రభుత్వంలోని సీనియర్ నేతలంతా విదేశాలకు పారిపోయారు. కానీ, ఆమె మాత్రం అఫ్ఘాన్‌లో తన ఇంట్లోనే ఉండిపోయింది. ఎక్కడికి వెళ్లాలి??... ఇది ఆమె ప్రశ్న. దేశంలోని మైదాన్ వార్దాక్ ప్రావిన్స్ లో  మేయర్ అయిన ఆమెకు గతంలో చాలాసార్లు తాలిబన్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఆమెపై చాలాసార్లు హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి.

నిరుడు ఆమెను మూడోసారి చంపడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో.. ఇరవై రోజుల తర్వాత నవంబర్ 15న జరీఫా తండ్రి అబ్దుల్ ఘఫారీని మిలిటెంట్లు  కాల్చిచంపారు. ఇప్పుడు ఎక్కడికీ వెళ్లలేని స్థితిలో తన చావు కోసం ఎదురు చూస్తున్నానని జరాఫీ అంటున్నారు. 

కాగా, ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజలకు తాలిబన్లు క్షమాబిక్షను ప్రకటించింది. రెండు రోజుల్లోనే తిరిగి విధులకు హాజరు కావాలని అధికారులను  ఆదేశించింది.

అందరికీ సాధారణ క్షమాభిక్ష ప్రకటించినట్టుగా తాలిబన్లు ఓ ప్రకటనను విడుదల చేశారు. పూర్తి విశ్వాసంతో మీ జీవితాన్ని ప్రారంభించాలని ఆ ప్రకటనల్ తేల్చి చెప్పారు.ఆఫ్ఘనిస్తాన్ నుండి తమ సైన్యాన్ని ఉపసంహరించుకొంటామని అమెరికా ప్రకటించిన కొద్ది రోజులకే తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ లో అధికారాన్ని హస్తగతం చేసుకొన్నారు.

తాలిబన్లు కాబూల్ ను వశం చేసుకొన్న తర్వాత ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో తాలిబన్లు ఈ ప్రకటన చేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అనుమతి లేకుండా ఎవరి ఇళ్లలోకి ప్రవేశించవద్దని తమ ఫైటర్లను ఆదేశించినట్టుగా తాలిబన్లు స్పష్టం చేశారు.ప్రజల ఆస్తులు, ప్రాణాలను కాపాడాలని కూడ సూచించామన్నారు.

భారతీయుల క్షేమమే ముఖ్యం.. కాబూల్ విమానాశ్రయంతోనే సవాల్: విదేశాంగ మంత్రి జైశంకర్

కాబూల్‌ను స్వాధీనం చేసుకొన్న తర్వాత ఆప్ఘనిస్తాన్‌లోని ఓ వినోద కార్యక్రమంలో తాలిబన్లు ఎంజాయ్ చేశారు. చేతుల్లో ఆయుధాలతో ఎలక్టిక్ బంపర్ కార్లను నడుపుతూ ఆనందంగా గడిపారు.  బొమ్మ గుర్రాలపై స్వారీ చేస్తూ గడిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి.

ఆఫ్ఘన్‌లో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఎంఈఏ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కాబూల్‌లో భారత రాయబారి, అతని సిబ్బంది వెంటనే ఇండియాకు వెళ్లాలని నిర్ణయించినట్టుగా చెప్పారు.

తాలిబన్ నాయకుడు అమీర్ ఖాన్ ముత్తాకి ఆఫ్ఘన్ రాజధానిలో కాబూల్ రాజకీయనాయకత్వంతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఒకప్పుడు దేశానికి నాయకత్వానికి వహించిన అబ్దుల్లా, హామీద్ కర్జాయ్ తదితరులు ఈ చర్చల్లో పాల్గొంటున్నారు.ముత్తాఖి గతంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. 
 

click me!