COVID-19 in Singapore: సింగపూర్‌లో కరోనా మహమ్మారి కోరలు చాచింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 26 వేల మంది వైరస్ బారిన పడ్డారు. ప్రజలు మళ్లీ మాస్కులు ధరించాలని, వేరియంట్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది సింగపూర్ ప్రభుత్వం.
COVID-19 in Singapore: గత నాలుగేండ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా కుదిపేసిందో ఆ విషాదం అందరికీ తెలిసిందే.ఈ ఎవరూ ఊహించని విధంగా సంభవించిన ఈ ఉపద్రవంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్ల మంది బతుకులు రోడ్డున పడ్డాయి.
ఇప్పుడూ మరోసారి కరోనా మహమ్మారి అలజడి రేపుతోంది. మే 5 నుంచి 11 తేదీల మధ్య కొత్త 25,900 కేసులు వెలుగులోకి వచ్చాయని, దేశప్రజలను మాస్కులు ధరించాలని ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ సూచించారు. కరోనా వైరస్ నిరంతరం పెరుగుతోందనీ, కాబట్టి వచ్చే రెండు, నాలుగు వారాల్లో తారాస్థాయికి చేరుకోవచ్చని ఆరోగ్య మంత్రి చెబుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి సామాజిక ఆంక్షలు అమలు చేసే ఆలోచన లేదని ఆయన అన్నారు.
undefined
25 వేలకు పెరిగిన కేసులు
2024 మే 5 నుండి మే 11 మధ్య అంటే కేవలం వారం రోజుల్లో సింగపూర్ లో కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల సంఖ్య 25,900 కు చేరింది. అంతకుముందు వారం నమోదైన 13,700 కోవిడ్ 19 కేసులతో పోలిస్తే ఇది 90% పెరుగుదల అని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ తో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య రోజువారీ సగటు 181 నుండి 250 కు పెరిగిందని వెల్లడించింది.
అలాగే.. ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ లో చేరే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందన్నారు. ఎమర్జెన్సీ ఆసుపత్రి పడకలను నిర్వహించడానికి అత్యవసరం కాని ఎలక్టివ్ సర్జరీ కేసులను తగ్గించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రభుత్వ ఆసుపత్రులను కోరింది. దీనితో పాటు.. రోగులను మొబైల్ ఇన్‌పేషెంట్ కేర్ ఎట్ హోమ్ ద్వారా ఇంటికి పంపాలని సూచించారు.
సింగపూర్ ఎలా సిద్ధమైంది?
గత 12 నెలల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోకుంటే.. తీవ్రమైన వ్యాధి బారిన పడే ప్రమాదం ఉన్న వ్యక్తులు అదనపు మోతాదులో తీసుకోవాలని ఆరోగ్య మంత్రి ఓంగ్ కోరారు. కోవిడ్ -19 కేసుల సంఖ్య రెట్టింపు అయిన తర్వాత, సింగపూర్‌లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నిర్వహించగల 500 మంది రోగులు ఉంటారని ఓంగ్ చెప్పారు. కానీ, కేసుల సంఖ్య మళ్లీ రెట్టింపైతే మాత్రం వైద్య వ్యవస్థపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుందని హెచ్చరించారు. ప్రస్తుతానికి తాము ఎటువంటి సామాజిక ఆంక్షలు విధించలేదని, తప్పనిసరి పరిస్థితిలో ఆంక్షలు విధిస్తామని పేర్కొన్నారు.