బర్త్ డే పార్టీలో కాల్పులు.. ఒకరు మృతి,9మందికి గాయాలు

Published : Jul 23, 2018, 12:02 PM IST
బర్త్ డే పార్టీలో కాల్పులు.. ఒకరు మృతి,9మందికి గాయాలు

సారాంశం

తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో నిందితుడు మృతిచెందగా.. మరో 9 మంది గాయపడ్డారు. బాధితుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కెనడాలోని టొరంటో నగరంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. స్థానిక గ్రీక్‌టౌన్‌ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌ లోపల బర్త్ డే పార్టీ జరుగుతుండగా.. గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో నిందితుడు మృతిచెందగా.. మరో 9 మంది గాయపడ్డారు. బాధితుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కెనడా కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు టొరంటో పోలీసులు తెలిపారు. కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. అయితే అంతలోపే ఆ నిందితుడు తనను తాను కాల్చుకుని చనిపోయినట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ ఘటనలో 9 మంది గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. అయితే ప్రస్తుతం వీరి పరిస్థితి ఎలా ఉందన్నదానిపై స్పష్టమైన సమాచారం లేదు.

PREV
click me!

Recommended Stories

ఇక్క‌డ ఎన్ని అణు బాంబులు ప‌డ్డా ఏం కాదు.. ప్ర‌పంచంలో అత్యంత భ‌ద్ర‌మైన దేశం ఏదో తెలుసా?
Iran Israel War : ఇండియాను తాకిన ఇరాన్-ఇజ్రాయెల్ వార్ సెగ.. విశాఖవాసులు బిగ్ షాక్