ప్లేబాయ్ మాజీ మోడల్‌తో ట్రంప్ రాసలీలలు: ఆ ఆడియో సంభాషణే కీలకం?

First Published 21, Jul 2018, 3:11 PM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్లేబాయ్ మాజీ మోడల్  కరెన్ మెక్ డౌగల్  మధ్య వివాహేతర సంబంధంపై  దర్యాప్తు అధికారులకు  బలమైన ఆధారాలు లభ్యమైనట్టుగా  ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్లేబాయ్ మాజీ మోడల్  కరెన్ మెక్ డౌగల్  మధ్య వివాహేతర సంబంధంపై  దర్యాప్తు అధికారులకు  బలమైన ఆధారాలు లభ్యమైనట్టుగా  ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

కెన్ మెక్ డౌగల్‌తో తనకు ఉన్న సంబంధం విషయంలో  ఆమె  నోరు మూయించేందుకు గాను  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మాజీ అటార్నీ మైఖేల్ కోహెన్‌తో జరిపిన ఆడియో సంభాషణ క్లిప్ దర్యాప్తు అధికారులకు లభించిందని ఓ పత్రిక  కథనాన్ని  ప్రచురించింది. 

ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావాలన్నా.. కరెన్‌ను కట్టడి చేయాలన్నా ఎంతో కొంత చెల్లించి ఆమె నోరు మూయించండని ట్రంప్‌ సూచించగా.. ‘వ్యవహారం ఇక్కడే తేల్చేద్దాం’ అని కోహెన్‌ బదులిచ్చినట్టుగా ఆ ఆడియో క్లిప్‌లో ఉంది. అయితే 90 సెకన్ల పాటు వీరిద్దరి మధ్య సంభాషణ సాగింది.  అయితే ముందుజాగ్రత్త కోసం కోహెన్  ట్రంప్ మాటలను రికార్డు చేసినట్టుగా  ప్రచారం సాగుతోంది.

ఈ ఆడియో సంభాషణను  ఫెడరల్ ఏజంట్లు కోహెన్ కార్యాలయం నుండి స్వాధీనం చేసుకొన్నారని  ఆ మీడియా కథనంలో ప్రచురించింది. అయితే ట్రంప్‌కు కోహెన్‌కు మధ్య ఈ ఆడియో సంభాషణ జరిగిన విషయం నిజమేనని ట్రంప్ వ్యక్తిగత అటార్నీ రూడీ గిలియానీ ప్రకటించారు.

మాజీ ప్లేబాయ్ మోడల్‌తో ఎలాంటి ఒప్పందం జరగలేదన్నారు. మాజీ ప్లేబాయ్ మోడల్‌ కౌగల్‌తో ట్రంప్ ఎఫైర్ కారణంగా ఆయనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని రూఢీ అభిప్రాయపడ్డారు.  

2006లో ట్రంప్‌ తనతో అఫైర్‌ కొనసాగించారని.. ఆదే సమయంలో ట్రంప్‌ భార్య మెలానియా కొడుక్కి జన్మనిచ్చిందని మెక్‌డౌగల్ ఆరోపించారు. తొమ్మిది నెలలపాటు వారి సంబంధం కొనసాగిందని గతంలోనే ఆమె ప్రకటించారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయాలను బయటకు పొక్కనీయకుండా ట్రంప్‌ డబ్బుతో ఒప్పందం చేసుకున్నాడంటూ ఆమె పేర్కొన్నారు.
 

Last Updated 21, Jul 2018, 3:11 PM IST