అమెరికాలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, 21మందికి గాయాలు...

By SumaBala Bukka  |  First Published Feb 15, 2024, 9:19 AM IST

అమెరికాలో కాల్పులు మళ్లీ కలకలం రేపాయి. కాన్సాస్ సిటీలో జరిగిన కాల్పుల్లో 21మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఒకరు మరణించారు. 


కాన్సాస్ సిటీ : కాన్సాస్ సిటీ చీఫ్స్ సూపర్ బౌల్ విజయోత్సవ ర్యాలీలో బుధవారం జరిగిన సామూహిక కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, పలువురు చిన్నారులు సహా 21 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 17 ఏళ్లలోపు ఉన్న 12 మందికి కాన్సాస్ సిటీలోని చిల్డ్రన్స్ మెర్సీ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. వీరిలో వారిలో 11 మంది పిల్లలే. వీరిలో తొమ్మిది మంది తుపాకీ గాయాలకు గురయ్యారు.

ఘటన తర్వాత ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, అయితే కాల్పులు జరపడానికి గల కారణాలు, పరిస్థితులపై ఇంకా విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కాన్సాస్ సిటీ ఫైర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ మాట్లాడుతూ, చాలామందికి "ప్రాణాంతకమైన గాయాలు" అయ్యాయని తెలిపారు. 

Latest Videos

undefined

BAPS Mandir : అబుదాబీలో మొట్టమొదటి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన నరేంద్ర మోడీ

అమెరికాలోని మీసోరి రాష్ట్రంలో జరిగిన ఈ కాల్పుల ఘటన తీవ్ర కలకలాన్ని సృష్టించింది. ఆదివారం సూపర్ ఫైనల్ జరిగింది. ఇందులో ‘కాన్సాస్ సిటీ చీఫ్స్’ అనే జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా నగరంలో కవాతు నిర్వహించారు. ఆ కార్యక్రమాలలోనే కాల్పులు వెలుగు చూశాయి. ఈ కవాతులో పెద్ద ఎత్తున నగర ప్రజలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇక ముగుస్తుందండగా కాల్పుల ఘటన వెలుగు చూసింది. ముందుగా ఈ మార్చ్ కు సమీపంలో ఉన్న పెట్రోల్ పంపు నుండి కాల్పులు జరిగిన శబ్దం వినిపించింది.  

ఈ శబ్దాలు విన్న వెంటనే అక్కడికి కవాతులో పాల్గొన్న వారంతా భయంతో పరుగులు తీయడం దాక్కోవడం మొదలుపెట్టారు. ఈ కాల్పుల్లో అనుమానితులుగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీస్ చీఫ్ మీడియా సమావేశంలో తెలిపారు.  అయితే ఇలా దాడి చేయడానికి కారణాలేంటో ఇంకా తెలియ రాలేదని తెలిపారు.  కాల్పుల్లో 22 మంది గాయపడ్డారని, వారిలో ఒకరు మరణించారని అగ్నిమాపక శాఖ చీఫ్ రాస్ గ్రాండి సన్ అన్నారు. గాయపడిన వారిలో 15మందికి తీవ్ర గాయాలతో విషమ పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు.

కాల్పుల ఘటనకు సంబంధించిన ఓ వీడియో కూడా వెలుగు చూసింది. మార్చ్ లో పాల్గొన్నవారు ఓ అనుమానితుడిని పట్టుకున్నారని కూడా పోలీసులు తెలిపారు. అమెరికా న్యాయశాఖ 2020లో తుపాకీ హింస జరిగే రా నుండి తుపాకీ హింసను ఎదుర్కోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్న నగరాల జాబితాను రూపొందించింది.  ఈ 9 నగరాల జాబితాలో కాన్సర్సిటీ కూడా ఒకటి ఇక్కడ నిత్యం కాల్పుల ఘటనలో వెలుగులోకి వస్తున్నాయి 2002లో 152 మంది హత్యకు గురయ్యారు దీనికి కారణంగా కాల్పులు జరిగాయి 

click me!