అది పూర్తిగా తప్పుడు ప్రచారం.. జకీర్ నాయక్‌ను ఆహ్వానించలేదు: ఖతర్

By Rajesh KarampooriFirst Published Nov 23, 2022, 10:02 PM IST
Highlights

ఖతార్‌లోని దోహాలో జరిగే ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు, పరారీలో ఉన్న  జకీర్ నాయక్‌కు ఎలాంటి అధికారిక ఆహ్వానం అందలేదని కతార్  తెలిపింది. ఈ మేరకు కతార్ దౌత్య మార్గాల ద్వారా భారతదేశానికి తెలియజేసింది.

వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు, పరారీలో ఉన్న జకీర్ నాయక్‌ను ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆహ్వానించారనే వార్తలపై ఖతార్ క్లారిటీ ఇచ్చింది. ఖతార్‌లోని దోహాలో జరుగుతున్న FIFA ప్రపంచ కప్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని జకీర్ నాయక్‌కు అధికారిక ఎలాంటి ఆహ్వానం అందించలేదని కతార్  తెలిపింది. ఈ మేరకు కతార్ దౌత్య మార్గాల ద్వారా భారతదేశానికి తెలియజేసింది. భారత్-ఖతార్ ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోయేలా.. ఉద్దేశపూర్వకంగా ఈ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశాయని పేర్కొంది.

భారత్ అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత ఖతార్ నుంచి ఈ స్పందన వచ్చింది. వివిఐపి బాక్స్‌ నుంచి ఫిఫా ప్రపంచకప్‌ ప్రారంభోత్సవాన్ని వీక్షించేందుకు ఇస్లామిస్ట్ జకీర్‌ నాయక్‌ను అధికారికంగా ఆహ్వానిస్తే.. వైస్ ప్రెసిడెంట్  జగదీప్‌ ధన్‌ఖర్‌ పర్యటనను భారత్‌ రద్దు చేసుకోవాల్సి వస్తుందని మోదీ ప్రభుత్వం ఖతార్‌కు స్పష్టం చేసింది.

ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ ఖతార్ పర్యటనకు వెళ్లారు. వైస్ ప్రెసిడెంట్ ధంఖర్ నవంబర్ 20న కార్యక్రమానికి హాజరై మరుసటి రోజు ఖతార్ నుండి బయలుదేరారు. ఖతార్‌లో ఫుట్‌బాల్ స్టేడియంలను నిర్మించిన భారతీయ ప్రవాసులను కూడా ఆయన కలిశారు. జకీర్ నాయక్ దోహాకు వ్యక్తిగత పర్యటనలో ఉండవచ్చని ఖతార్ అధికారులు తెలిపారు. జకీర్ నాయక్ వివాదమంతా ఇతర దేశాలు కల్పితమని, ఖతార్‌పై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నదని ఖతార్ ప్రభుత్వం భారత మధ్యవర్తులకు తెలిపింది.

వివాదాస్పద టెలివింజెలిస్ట్ జాకీర్ నాయక్ పై మనీ లాండరింగ్‌తోపాటు విద్వేష పూరిత ప్రసంగాలు చేశాడనే ఆరోపణలున్నాయి. మత బోధనల పేరుతో యువతను రెచ్చగొట్టడం, హింస వైపు నడిపించడం, ఆర్థికపరమైన అక్రమాలకు పాల్పడ్డట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు పలు కేసులను ఎదుర్కొంటున్నారు. అతని సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ దేశంలో నిషేధించబడింది. గతంలో ఆయన పీస్ టీవీ నెట్‌వర్క్ ద్వారా ప్రచారం నిర్వహించేవాడు. ఆసత్య ప్రచారాల ద్వారా  యువతను తప్పుడు బాట పడుతున్నారని కేంద్రం కూడా గుర్తించింది.

ఈ క్రమంలో ఆయనపై, తన సంస్థను 2016లో నిషేధించబడింది. ఈ ఘటనతో జకీర్ దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం మలేసియాలో ఉంటున్నారు. అయినా..  జాతీయ భద్రత దృష్ట్యా 2020లో దేశంలో ప్రసంగాలు చేయకుండా నిషేధించారు. బలవంతపు మతమార్పిడులకు పాల్పడినట్టు సాక్ష్యాధారాలు ఉండటంతో అతనిపై ఛార్జిషీట్ దాఖలు చేయబడింది. అతడ్ని ఇండియా తీసుకొచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. 

click me!