అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు.. ఏడుగురు మృతి..

Published : Nov 23, 2022, 11:19 AM ISTUpdated : Nov 23, 2022, 05:48 PM IST
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు.. ఏడుగురు మృతి..

సారాంశం

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేగింది. వర్జినీయాలోని వాల్‌మార్ట్‌లో జరిగిన కాల్పుల్లో దాదాపు ఏడుగురు మృతి చెందారు.

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేగింది. వర్జినీయాలోని చెసాపీక్‌లోని వాల్‌మార్ట్‌ స్టోర్‌లో జరిగిన కాల్పుల్లో దాదాపు ఏడుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు. పలువురు గాయపడినట్టుగా చెప్పారు. ఈ ఘటనను చెసాపీక్ పోలీస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లియో కోసిన్స్కి ధ్రువీకరించారు. అధికారులు వాల్ మార్ట్‌లోకి ప్రవేశించి చాలా మంది వ్యక్తులు చనిపోయినట్లు, గాయపడినట్లు కనుగొన్నారని తెలిపారు.  స్టోర్ మేనేజర్‌గా భావిస్తున్న ఒక వ్యక్తి కాల్పులు జరిపినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత అతడు కూడా కాల్చుకుని చనిపోయాడని చెప్పారు. 

శామ్స్ సర్కిల్‌లోని వాల్‌మార్ట్‌లో గత రాత్రి జరిగిన కాల్పుల్లో షూటర్‌తో సహా 7 మంది మృతి చెందినట్లు చీసాపీక్ పోలీసులు ధృవీకరించారు. స్థానిక కాలమానం ప్రకారం 22:12 గంటలకు (03:12 GMT) దాడి జరిగిందని పోలీసులు విలేకరులకు తెలిపారు. పోలీసు అధికార ప్రతినిధి లియో కోసిన్స్కీ మాట్లాడుతూ.. దుకాణం లోపల కాల్పులు జరిగినట్లు భావిస్తున్నామని, ఒక్కడే ఈ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోందన్నారు. ఈ విషాదకరమైన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని వాల్‌మార్ట్ తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..