నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు బస్సులు ఢీ.. 37 మంది మృతి..

By team teluguFirst Published Nov 23, 2022, 11:16 AM IST
Highlights

నైజీరియాలో మూడు బస్సులు ఢీకొన్న ఘటనలో 37 మంది చనిపోయారు. ముందుగా రెండు బస్సులు ఎదురుదెరుగా ఢీకొన్న వెంటనే వాటిపైకి మరో బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. 

ఈశాన్య నైజీరియా నగరమైన మైదుగురిలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు బస్సులు ఢీకొన్న ఘటనలో 37 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ఆ దేశ రోడ్డు సేఫ్టీ ఏజెన్సీ తెలిపింది.  వివరాలు ఇలా ఉన్నాయి. మైదుగురి వెలుపల రెండు వాణిజ్య బస్సులు ప్రయాణిస్తున్న సమయంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. అయితే అదే సమయంలో మరో బస్సు కూడా వాటిపైకి దూసుకెళ్లింది.

సీఈసీగా ఉత్తమైన వ్యక్తి ఉండాలి.. టీఎన్ శేషన్ లాంటి వ్యక్తి అవసరం: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..

బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురికి వెలుపల 35 కిలోమీటర్ల (20 మైళ్ళు) దూరంలో ఉన్న జకానా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 37 మంది మరణించినట్టు నిర్ధారించామని రోడ్డు సేఫ్టీ ఏజెన్సీ చీఫ్ ఉట్టెన్ బోయి తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారని చెప్పారు. ఓ బస్సు ప్రయాణిస్తున్న సమయంలో టైరు పగిలిపోయిందని, దీంతో అది ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనకు మితిమీరిన వేగం కారణమని చెప్పారు.

నేపాల్ ఎన్నికలు.. ఏడోసారి ఎన్నికైన ప్రధాని షేర్ బహదూర్ దేవుబా

ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియాలో పేలవమైన రోడ్డు నిర్మాణాల వల్ల ఇక్కడ ప్రమాదాలు సర్వసాధారణం. వేగంగా వాహనాలను నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకపోవడం కూడా దీనికి ఒక కారణం. కాగా.. అంతకుముందు మంగళవారం నైజీరియా రాజధాని అబుజా సమీపంలో కూడా ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు ట్రక్కును ఢీకొనడంతో 17 మంది మరణించారు. నలుగురు గాయపడ్డారు. ఇందులో బాధితులంతా ఈశాన్య గోంబే రాష్ట్రానికి చెందిన వారు. 
 

click me!