వచ్చే కరోనా వేరియంట్ ప్రమాదకరంగా ఉండొచ్చు: ల్యాబ్ రిపోర్టు

By Mahesh KFirst Published Nov 28, 2022, 5:22 PM IST
Highlights

వచ్చే కరోనా వేరియంట్ ప్రమాదకరంగా ఉండొచ్చని దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ల్యాబ్ అధ్యయనం వెల్లడించింది. రోగనిరోధక శక్తి లేని వ్యక్తిలో నుంచి కరోనా శాంపిళ్లను ఆరు నెలల నుంచి సేకరించి చేపట్టిన అధ్యయనంలో ప్రస్తుత తక్కువ ప్రమాదకర ఒమిక్రాన్ నుంచి వుహాన్‌లో వెలుగుచూసిన ప్రమాదకర వైరస్‌గా పరిణమించే ముప్పు ఉన్నదని ఈ స్టడీ పేర్కొంది.
 

న్యూఢిల్లీ: ఓ దక్షిణాఫ్రికా ల్యాబరేటరీ అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోగనిరోధక శక్తి లేని ఓ వ్యక్తి నుంచి ఆరు నెలలుగా శాంపిళ్లు తీసుకుని చేసిన అధ్యయనంలో ఈ వైరస్ మరింత ప్రమాదకారిగా పరిణమించే ముప్పు ఉన్నదని ఆ అధ్యయనం వివరించింది. కొత్త వేరియంట్ ఎక్కువ వ్యాధి తీవ్రతను కలిగిస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఒమిక్రాన్ స్ట్రెయిన్ తో పోలిస్తే ఎవాల్వ్ అయిన కొత్త కరోనా స్ట్రెయిన్ డేంజర్‌గా ఉంటుందని పేర్కొంది.

గతేడాది ఒమిక్రాన్ స్ట్రెయిన్ పై వ్యాక్సిన్ ప్రభావాన్ని తొలిసారి పరిశోధించిన ల్యాబరేటరీనే ఈ అధ్యయనం చేపట్టింది. ఈ ల్యాబ్ హెచ్ఐవీ, కరోనా సోకిన ఓ పేషెంట్ నుంచి శాంపిల్స్ ఆరు నెలలపాటు తీసుకుని పరిశీలనలు చేసింది. తొలుత ఈ వైరస్ ఒమిక్రాన్ బీఏ.1 స్ట్రెయిన్ తీవ్రత నే కలిగి ఉంది. జీవ కణాన్ని వశపరుచుకోవడం, ప్రాణాలు తీసే ముప్పును కలిగి ఉండే తీవ్రత ఒమిక్రాన్ బీఏ.1 స్ట్రెయిన్‌ తో పోలి ఉన్నదని ఈ అధ్యయనం తెలిపింది. కానీ, ఈ స్ట్రెయిన్ ఆ పేషెంట్‌లో ఎవాల్వ్ అవుతున్నా కొద్దీ దాని తీవ్రత పెరుగుతూ వచ్చిందని వివరించింది. చైనాలోని వుహాన్‌ లో తొలిసారి వెలుగుచూసిన కొవిడ్ 19 వెర్షన్‌ తీవ్రత ను అందుకున్నదని తెలిపింది.

Also Read: కోవిడ్ -19 ముగిసిందా? ఒమిక్రాన్ ఎక్స్ బీబీ సబ్ వేరియెంట్ పై డబ్ల్యుహెచ్ వో చీఫ్ సైంటిస్ట్ ఏం అన్నారంటే ?

కరోనా వైరస్ తొలుత తీవ్ర ముప్పును, ప్రాణ నష్టాన్ని కలిగించినా.. ఆ తర్వాత దాని కొత్త వేరియంట్ల ప్రమాద తీవ్రత తగ్గుతూ వచ్చింది. కానీ, రోగనిరోధక శక్తి లేని వ్యక్తుల్లో ఈ వైరస్ నెలలపాటు ఆశ్రయం తీసుకుని మళ్లీ సామర్థ్యాన్ని కూడబెట్టుకుంటున్నదని స్థూలంగా అర్థం అవుతున్నది. రోగనిరోధక శక్తి లేని శరీరాల్లో ఆ వైరస్ కు ఎదురే లేకుండా పోతుంది. ఎక్కువ కాలం ఆశ్రయం పొందడం, ఆ వైరస్ మరింత ఎవాల్వ్ కావడానికి, ప్రమాదకారిగా మారడానికి ఆస్కారం ఏర్పడుతుందని తెలుస్తున్నది.

సౌత్ ఆఫ్రికాలో డర్బన్ సిటీలోని ఆఫ్రికా హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో అలెక్స్ సైగల్ సారథ్యంలో ఈ అధ్యయనం చేశారు. కొవిడ్ కారకం మ్యుటేట్ అవుతూనే ఉంటుందని, తద్వార ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు అవతరించే అవకాశాలు ఉన్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. అయితే, ఈ అధ్యయనం అంతా కూడా ఒక పేషెంట్ నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా చేపట్టారు. దీనిపై ఇంకా సమీక్ష జరగాల్సి ఉన్నది.

click me!