New Covid-19 mutant XE : కరోనా వైరస్ మహమ్మారి మరో కొత్త వేరియంట్ "ఎక్స్ఈ" (New Covid-19 mutant XE) ముప్పు పొంచివుందని నిపుణలు పేర్కొంటున్నారు. అమెరికా, పలు యూరప్ దేశాల్లో ప్రస్తుతం అధికంగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా ఎక్స్ఈ వేరియంట్ ఇదివరకు అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2 కంటే అధికంగా వ్యాపిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
Coronavirus: యావత్ మానవాళికి కరోనా వైరస్ మహమ్మారి సవాలు విసురుతూనే ఉంది. రోజురోజుకూ తన రూపు మార్చుకుంటున్న కరోనా మమహ్మారి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఇప్పటికే వెలుగుచూసిన అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్, దాని సబ్ వేరియంట్ బీఏ.ఈ ల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ ఎక్స్ఈ వేరియంట్ (New Covid-19 mutant XE) వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త వేరియంట్ ఒమక్రిన్, దాని సబ్ వేరియంట్ బీఏ.2 కంటే వేగంగా 10 శాతం అధికంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం అమెరికా సహా పలు యూరప్ దేశాల్లో ఈ వేరియంట్ కారణంగా కరోనా వైరస్ కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో తో పాటు అన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అసలు ఈ కరోనా XE వేరియంట్ (New Covid-19 mutant XE) అంటే ఏమిటి?
undefined
కరోనా వైరస్ ఎక్స్ఈ వేరియంట్ ఒమిక్రాన్ కు చెందిన రెండు సబ్ వేరయంట్లు BA.1 మరియు BA.2 ల ఉత్పరివర్తనం. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసులలో కొద్ది భాగానికి మాత్రమే కారణమవుతుందని ప్రస్తుతం అంచనాలు ఉన్నాయి. XE అనేది రీకాంబినెంట్ స్ట్రెయిన్ అని నిపుణులు చెబుతున్నారు.
ఎక్స్ఈ వేరియంట్ ను ఎక్కడ గుర్తించారు?
XE రీకాంబినెంట్ (BA.1-BA.2) వేరియంట్ ను జనవరి 19న UKలో మొదటిసారిగా గుర్తించారు. ఇందులో 600 కంటే తక్కువ సీక్వెన్సులు నివేదించబడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసులు పలు దేశాల్లో గుర్తించారు.
ఎక్స్ఈ వేరియంట్ (New Covid-19 mutant XE) వ్యాప్తి ఎలా వుంటుంది?
ప్రస్తుత అంచనాల ప్రకారం.. ప్రస్తుతం అత్యంత వేగంగా వ్యాపించే BA.2 వేరియంట్ కంటే 10 శాతం కమ్యూనిటీ వృద్ధి రేటు కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, దీనిని వ్యాప్తి, ప్రభావంపై ఖచ్చితమైన నిర్ణయానికి రావడానికి మరింత డేటా అవసరముందని గ్లోబల్ హెల్త్ బాడీ వెల్లడించింది. అయితే, దీనిని పూర్తి సమాచారం తెలుసుకునేంత వరకు దీనిని ఒమిక్రాన్ వేరియంట్ భాగంగా వర్గీకరించనున్నారు.
మరికొన్ని వేరియంట్లు కూడానూ..
UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) అధ్యయనం ప్రకారం, ప్రస్తుతం మూడు కొత్త రీకాంబినెంట్ జాతులు ప్రసారంలో ఉన్నాయి. అవి XD, XE మరియు XF వేరియంట్లు. వీటి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.
కరోనా తో 6,171,483 మంది చనిపోయారు..
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం పలు దేశాల్లో కొనసాగుతూనే ఉంది. చైనా, దక్షిణ కొరియాలో ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అమెరికా, పలు యూరప్ దేశాల్లో కొత్త వేరియంట్ల కారణంగా క్రమంగా కరోనా కేసులు అధికంగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా 6,171,483 మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని దేశాల్లో కలిపి దాదాపు 490,130,127 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అధికంగా కరోనా కేసులు, మరణాలు అమెరికా, భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, రష్యా, టర్కీ, ఇటలీ, సౌత్ కొరియా దేశాల్లో నమోదయ్యాయి.