Russia Ukraine Crisis: ప్ర‌ధాని మోడీకి థ్యాంక్స్ చెప్పిన నేపాల్ ప్ర‌ధాని.. ఎందుకంటే..?

Published : Mar 13, 2022, 12:22 AM IST
Russia Ukraine Crisis: ప్ర‌ధాని మోడీకి థ్యాంక్స్ చెప్పిన నేపాల్ ప్ర‌ధాని.. ఎందుకంటే..?

సారాంశం

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్ గంగా అనే కార్య‌క్ర‌మంలో భాగంగా.. భార‌త ప్ర‌భుత్వం ఉక్రెయిన్ నుండి నలుగురు నేపాల్ పౌరులను  భారతదేశం మీదుగా నేపాల్ చేరించింది. దీంతో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేబువా భారతదేశానికి, భార‌త ప్రధాని మోడీని ధన్యవాదాలు తెలిపారు  

Russia Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ సైనిక దాడి నేప‌థ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తమ దేశ విద్యార్థులను స్వదేశానికి సురక్షితంగా చేర్చడంలో సహకరించిన భారత ప్రభుత్వానికి నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ధన్యవాదాలు తెలియజేశారు. ఆపరేషన్ గంగాలో భాగంగా నలుగురు నేపాల్ పౌరులను ఉక్రెయిన్ నుంచి ఇండియా మీదుగా నేపాల్ కు త‌ర‌లించారు. దీంతో భారత ప్రధాని నరేంద్ర మోదీకి నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా కృతజ్ఞతలు తెలిపారు. 

"నలుగురు నేపాలీ జాతీయులు ఉక్రెయిన్ నుండి భారతదేశం మీదుగా నేపాల్ చేరుకున్నారు. #OperationGanga ద్వారా నేపాలీ జాతీయులను స్వదేశానికి రప్పించడంలో సహాయం చేసినందుకు ప్రధానమంత్రి @narendramodi, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు" అని దేవుబా శనివారం ఒక ట్వీట్‌లో తెలిపారు.

ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడిని ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్ర‌భుత్వం 'ఆపరేషన్ గంగా అనే బృహత్ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 26న  ప్రారంభించిన విషయం తెలిసిందే. 

 ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా సుమారు 18,000 మంది భారతీయులను యుద్ధ ప్రాంతం నుంచి సురక్షితంగా తరలిస్తున్నారు. భారతదేశం బలోపేతం అవుతునందు వల్లే ఉక్రెయిన్‌లోని యుద్ద ప్రాంతం నుంచి వేలాది మంది విద్యార్థులను వారి మాతృభూమికి తిరిగి తీసుకరాగ‌లుగుతోంది. ఉక్రెయిన్ విడిపోయిన ప్రాంతాలు - దొనేత్సక్,లుహాన్స్క్-లను స్వతంత్ర సంస్థలుగా గుర్తించిన మూడు రోజుల తర్వాత, ఫిబ్రవరి 24న రష్యా దళాలు ఉక్రెయిన్‌లో సైనిక కార్యకలాపాలను ప్రారంభించాయి.

ఉక్రెయిన్‌పై ర‌ష్యా పోరు సాగిస్తూనే ఉంది. ఇరు దేశాల సేనాల మ‌ధ్య హోరాహోరీ పోరు 17వ రోజుకు చేరుకుంది. ఈ వీరోచిత యుద్దంలో ఉక్రెయిన్ సామాన్య పౌరులను టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతున్నాయి ర‌ష్య‌న్ బ‌లాగాలు. 17 రోజులుగా యుద్ధం సాగుతున్నా రాజ‌ధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవాల‌ని రష్యా ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్నా.. సాధ్యం కావ‌డం లేదు. న‌గ‌ర స‌రిహద్దులోనే ర‌ష్యన్ సైన్యాల‌ను ఉక్రెయిన్ సేనాలు నిలువ‌రించాయి. 

మ‌రోవైపు ఇరుదేశాల మ‌ధ్య మూడు సార్లు చర్చలు జ‌రిగినా.. ఎలాంటి పురోగతి లేదు. ఆ చర్చలు  అసంపూర్తిగానే ముగిశాయి. యుద్ధం విరమించడానికి రష్యా ఏమాత్రం సిద్దంగా లేదు.. ఇటు ఉక్రెయిన్ ఓట‌మిని అంగీక‌రించి..లొంగిపోవ‌డానికి ఒప్పుకోవ‌డం లేదు. ఇరు దేశాలు ఏ మాత్రం త‌గ్గ‌క‌పోవ‌డంతో యుద్దం కొన‌సాగుతూనే ఉంది. రష్యా దాడుల్లో ఇప్పటివరకు 1300మంది పౌరులు చనిపోయారని ప్రకటించింది ఉక్రెయిన్‌.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే