నింగిలోకి దూసుకెళ్లిన టైం మిష‌న్ .. James Webb Space Telescope స‌క్సెస్

Published : Dec 26, 2021, 07:02 AM IST
నింగిలోకి దూసుకెళ్లిన  టైం మిష‌న్ .. James Webb Space Telescope స‌క్సెస్

సారాంశం

 నాసా మరో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించింది. జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపారు. మిషన్ లా పనిచేసే.. ఈ టెలిస్కోప్ ను గయానా స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేశారు. దీని ద్వారా ‎విశ్వంలోని రహస్యాలను ఛేదించడానికి ఉప‌యోగ‌ప‌డుతోందని భావిస్తోన్నారు.   

James Webb Space Telescope : అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ ( నాసా) మ‌రో అద్భుతం ఆవిష్కృతం చేసింది. ఇప్ప‌టికే ఈ సృష్టి ర‌హ‌స్కాల‌ను తెలుసుకోవడానికి ఎన్నో ఉప‌గ్ర‌హాలు, రోబోటిక్ రోవ‌ర్స్ ప్ర‌యోగించారు. తాజాగా.. విశ్వంలోని రహస్యాలను ఛేదించేందుకు నాసా మ‌రో ముంద‌డుగు వేస్తూ.. 
 ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌యారు చేసిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ( James Webb Space Telescope ) నింగిలోకి పంపించింది. దీనిని డిసెంబర్ 25 ఉదయం 07:20 (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.50) ల‌కు  ఏరియన్‌ 5 స్పేస్‌ రాకెట్‌లో  గయానా స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేశారు.

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్‌ స్పేస్‌ అకాడమీ, కెనడియన్‌ స్పేస్‌ ఏజెన్సీలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి.  జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‎ మిషన్ లా పనిచేస్తుందని, ఈ ‎విశ్వంలోని రహస్యాలను ఛేదించడానికి ఉప‌యోగ‌ప‌డుతోందని  నాసా శాస్త్ర‌వేత్తలు భావిస్తోన్నారు. టెలిస్కోప్ సక్సెస్ పుల్ అయితే.. విశ్వం పుట్టుకతో పాటు ఏలియన్స్‌ జాడ కూడా తెలుసుకోవ‌చ్చున‌ని  నాసా భావిస్తోంది. హబుల్‌ టెలిస్కోప్‌ వారసత్వాన్ని కొనసాగించటానికి రంగంలోకి దిగుతున్న జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌కు  షార్ట్‌ ఫామ్‌లో ‘వెబ్‌’ అని  పిలుస్తోన్నారు. 

Read Also :భారత్‌లోనూ బూస్టర్ డోస్.. ముందుగా ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి: ప్రధాని మోడీ కీలక ప్రకటన

ఈ ప్ర‌యోగంతో 25 ఏళ్ల కల నెరవేరింది. నాసా,ఈఎస్ఏ,సీఎస్ఏ లు సంయుక్తంగా నిర్వ‌హించిన ఈ ప్ర‌యోగానికి దాదాపు75 వేల 540 కోట్ల వ్యయం చేసింది. టైం మిష‌న్ లా ప‌ని చేసే.. ఈ టెలిస్కోప్ భూమికి 300 కిలోమీటర్ల దూరంలో ఉండనుంది. ఈ టెలిస్కోప్ కక్ష్య 30 నిమిషాల పాటు తిరగనుంది. వచ్చేనెలలో ఎల్ 2 పాయింట్‌కు చేరుకుంటుంది. విశ్వ ఆవిర్భావం,  బిగ్‌ బ్యాంగ్‌  పరిణామాలు, గెలాక్సీల పుట్టుక తెలుసుకోవాడానికి జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ పనిచేయనుంది. గ‌తంలో ప్ర‌యోగించిన‌ హబుల్ టెలిస్కోప్ కంటే మరిన్ని మెరుగ్గా ప‌నిచేయ‌బోతుంద‌ని భావిస్తోన్నారు. దాదాపు 20కి పైగా దేశాలు ఈ టెలిస్కోపు నిర్మాణంలో పని చేశాయి. దీని నిర్మాణంలో దాదాపు 10వేల మంది సైంటిస్టులు కష్టపడ్డారు.

Read Also : తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై బ్యాన్.. జనవరి 2 వరకు ఆంక్షలు, హద్దు మీరితే

 ఈ టెలిస్కోప్ ను  టైమ్ మెషిన్ అని ఎందుకు పిలుస్తున్నారంటే.. 1990లో అంతరిక్షంలో ప్ర‌యోగించిన‌  హబుల్ టెలిస్కోప్ .. విశ్వంపై మనకు ఉన్న‌ అవగాహనను పూర్తిగా మార్చి వేసింది. జేడబ్ల్యూఎస్‌ టెలిస్కోపు మాత్రం  గెలాక్సీల పుట్టుక , వాటి ఉనికి కూడా అర్థ‌మయ్యేలా  ఉపయోగపడుతుందని శాస్త్ర‌వేత్త‌లు ధీమా వ్యక్తంచేస్తున్నారు నిపుణులు. పాలపుంతతో సహా ఇతర గెలాక్సీల పుట్టుక గురించి మరిన్ని వివరాలు తెలియజేయనుందంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?